Share News

AP Elections: వైసీపీపై వ్యతిరేకత కనబడుతోంది..: పాతూరి నాగభూషణం

ABN , Publish Date - May 07 , 2024 | 02:12 PM

Andhrapradesh: ఏపీలో అనకాపల్లి, రాజమండ్రిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన అనంతరం ప్రజల నుంచి అశేషమైన స్పందన వచ్చిందని బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతి, అక్రమ అరాచక పాలనలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections: వైసీపీపై వ్యతిరేకత కనబడుతోంది..: పాతూరి నాగభూషణం
BJP Leader paturi nagabushanam

విజయవాడ, మే 7: ఏపీలో అనకాపల్లి, రాజమండ్రిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన అనంతరం ప్రజల నుంచి అశేషమైన స్పందన వచ్చిందని బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం (BJP Leader Paturi Nagabushanam) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ (YSRCP) , కాంగ్రెస్ (Congress) రెండు పార్టీలు అవినీతి, అక్రమ అరాచక పాలనలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులు అందరూ ఈ అవినీతి ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్యోగస్థులందరు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారని తెలియచేస్తున్నారన్నారు. 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది ఇచ్చారని.. ఇంకా పొడిగించమని కోరారు.

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!


ఏపీలో వైసీపీపై వ్యతిరేకత కనబడుతోందన్నారు. త్రిమూర్తుల శక్తితో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ పాలనతో 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి పనిచేస్తుందని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది జగన్ సొంతానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. బ్రిటిష్ వారు పాలించిన విధంగా జగన్ చట్టాలు తీసుకొచ్చి పాలించారన్నారు. పాస్ బుక్స్‌పై జగన్ ఫోటో పెడుతున్నారని.. అసలు ఒకరికి సంబంధించిన ఆస్తి పట్టాలపై జగన్ పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు.

KTR: పిరమైన మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!


రైతులు లోన్స్ తీసుకోవాలంటే జగన్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్వాకమన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు ఇవ్వకుండా జగన్ పక్కదారి పట్టించి రైతులను మోసం చేశారన్నారు. ఏపీలో బీజేపీ జాతీయ నాయకుల పర్యటనతో జగన్‌కు భయం పట్టుకుందన్నారు. 13వ తేదీన జరిగే పోలింగ్‌తో జగన్‌కు స్వస్తి పలికి ఎన్డీఏ కూటమికి స్వాగతం పలకనున్నారని బీజేపీ నేత పాతూరి నాగభూషణం వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Delhi: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. బెయిలిస్తే అలా చేయొద్దని సూచన

AP Elections: సీన్‌లోకి చిరంజీవి.. వార్ వన్‌సైడేనా..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 02:18 PM