Share News

Yadadri Thermal Plant: అక్టోబరుకల్లా ‘యాదాద్రి’లో 2 యూనిట్లు

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:58 AM

వచ్చే అక్టోబరుకల్లా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (వైటీపీఎ్‌స)లోని మొదటి దశలో రెండు యూనిట్లు(ఒక్కోటి 800 మెగావాట్లు) పూర్తి కావాలని ఇంధన శాఖ కార్యదర్శి, జెన్‌కో సీఎండీ రొనాల్డ్‌రాస్‌ ఆదేశించారు.

Yadadri Thermal Plant: అక్టోబరుకల్లా ‘యాదాద్రి’లో 2 యూనిట్లు

  • 2025 మార్చికల్లా మిగతా 3 యూనిట్లు సిద్ధం చేయాలి

  • జెన్‌కో సీఎండీ రొనాల్డ్‌రాస్‌

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే అక్టోబరుకల్లా యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (వైటీపీఎ్‌స)లోని మొదటి దశలో రెండు యూనిట్లు(ఒక్కోటి 800 మెగావాట్లు) పూర్తి కావాలని ఇంధన శాఖ కార్యదర్శి, జెన్‌కో సీఎండీ రొనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. శుక్రవారం విద్యుత్‌ సౌధలో బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ కె.సదాశివమూర్తి, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్లాంట్‌లోని మిగతా మూడు యూనిట్లను 2025 మార్చికల్లా పూర్తిచేయాలన్నారు. ఇక భద్రాద్రి, కేటీపీఎస్‌ ఏడో దశలో ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌(ఎ్‌ఫజీడీ) పనులను నిర్ణీత షెడ్యూల్‌లోగా పూర్తి చేయాలని కోరగా దీనికి బీహెచ్‌ఈఎల్‌ అధికారులు అంగీకారం తెలిపారు.


నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తిచేయడానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవాలని రొనాల్డ్‌ రాస్‌ సూచించారు. వైటీపీఎ్‌సలో అన్ని యూనిట్లను నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేయడానికి, జెన్‌కో ప్లాంట్లలో ఏ సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని బీహెచ్‌ఈఎల్‌ సీఎండీ తెలిపారు. ఈ సందర్భంగా అడ్వాన్స్‌డ్‌ అలా్ట్ర సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ, కోల్‌ గ్యాసిఫికేషన్‌ వంటి అధునాతన సాంకేతికతలపై రొనాల్డ్‌ రాస్‌ ఆరా తీశారు.

Updated Date - Jul 27 , 2024 | 04:58 AM