Share News

Hyderabad : కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ABN , Publish Date - Jul 22 , 2024 | 06:00 AM

రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Hyderabad : కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం జిల్లాల్లో వరద పరిస్థితిని ఆయన సమీక్షించారు.

పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోదావరి ఉధృతి వల్ల అక్కడి పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రెస్క్యూ టీమ్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలనీ సూచించారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

Updated Date - Jul 22 , 2024 | 06:00 AM