10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 18 , 2024 | 09:31 AM
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (10th Exams) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఏడాది 5.05 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్ష కేద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున 2,676 చీప్ సూపరిటెండెంట్‌లను నియమించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 30000 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను అధికారులు మానిటర్ చేయనున్నారు. మాస్ కాపీ చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. పరీక్ష కేంద్రాల చుట్టూ నో మొబైల్ జోన్ ఏర్పాటు చేశారు. పదోతరగతి విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.
ఇవి కూడా చదవండి..
PM Modi: నేడు జగిత్యాల పర్యటనకు మోదీ.. బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని
Praja Galam: జగన్.. పోలీసులు ఎక్కడ..!?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..