Share News

Rajasingh: ఓవైసీ బ్రదర్స్‌కు భయపడొద్దు.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ మద్దతు

ABN , Publish Date - Aug 27 , 2024 | 02:09 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవటం అభినందనీయమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని ఎమ్మెల్యే తెలిపారు.

Rajasingh: ఓవైసీ బ్రదర్స్‌కు భయపడొద్దు.. సీఎం రేవంత్‌కు రాజాసింగ్ మద్దతు
MLA Rajasingh

హైదరాబాద్, ఆగస్టు 27: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవటం అభినందనీయమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని ఎమ్మెల్యే తెలిపారు. వేల మంది యువత మద్దతు ఉందని అక్బరుద్దీన్ (MLA Akbaruddin) బెదిరిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరి భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళాలని సూచించారు.

MLC Kavitha: హమ్మయ్యా.. కవితకు బెయిల్


ఓవైసీ బ్రదర్స్‌ను బొక్కలో వేసిన సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరుందని గుర్తుచేశారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. చెరువులో 12ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజ్‌ను నిర్మించారన్నారు. అసదుద్దీన్ ఓవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు గులాంగిరి చేసిందని విమర్శించారు. కలెక్టర్ సాయంతో గోషామహాల్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు.


అక్బరుద్దీన్ ఏమన్నారంటే..

అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ హైడ్రా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్ కూల్చకండి. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించా. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని’’ అక్బరుద్దీన్ సూచించారు.

MLC Kavitha: కవితను ఈడీ ఎప్పుడెప్పుడు విచారించిందంటే..



హాట్‌టాపిక్‌గా సల్కం చెరువు కబ్జా...

అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సల్కం చెరువు కబ్జా విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్.. ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన విద్యాసంస్థలను కూల్చుతుందా? లేదా? అనేది సస్పెన్స్‌ను తలపిస్తోంది. ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చాలంటూ హైడ్రాకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి. చెరువును మట్టితో పూడ్చేసి భారీ భవనాల నిర్మాణం గావించారు . 2016 - 2021 లో కబ్జాకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం ప్రముఖంగా వినిపిస్తున్న కబ్జాల్లో సల్కం చెరువు కబ్జా ఒకటి. పైగా అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో ఇది రాష్ట్రంలో మరింత హాట్ టాపిక్‌గా మారింది. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు.


ఇవి కూడా చదవండి..

KTR Vs Bandi Sanjay: కవిత బెయిల్‌ నేపథ్యంలో.. బండి సంజయ్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Thummala: రుణమాఫీపై రైతుల ఆందోళన.. అపోహ పడొద్దన్న మంత్రి తుమ్మల

Read Latest Telangana News and Telugu News

Updated Date - Aug 27 , 2024 | 04:27 PM