Share News

Gajjela Kantham: మందకృష్ణ అలా చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:40 PM

Telangana: ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేశామని... ఈ పోరాటంలో అనేక మంది యువకులు చనిపోయారని కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ 30 ఏళ్లు పని చేశారని.. తాము కాదనడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నాంది పలికారని... వైఎస్ హయాంలోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు.

Gajjela Kantham: మందకృష్ణ అలా చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
Congress Leader Gajjela Kantham

హైదరాబాద్, ఆగస్టు 15: ఎస్సీ వర్గీకరణతో (sc classification) సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేశామని... ఈ పోరాటంలో అనేక మంది యువకులు చనిపోయారని కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం (Congress Leader Gajjela Kantham) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ 30 ఏళ్లు పని చేశారని.. తాము కాదనడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నాంది పలికారని... వైఎస్ హయాంలోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశారని.. కానీ బీఆర్ఎస్‌కు చిత్త శుద్ది లేదని విమర్శించారు.

Anna Canteens: పేదవాడి ఆకలి కేకలు తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు..


ఉంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుకు వెళ్లేదన్నారు. ఎవరు కూడా ఎస్సీ వర్గీకరణపై అడ్వికేట్‌ను పెట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అడ్వికేట్‌ను పెట్టారన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాల వల్ల ఎస్సీ వర్గీకరణ అయిందని మందకృష్ణ అనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుంచి 2024 వరకు ఎందుకు మోడీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పెట్టలేదని ప్రశ్నించారు. 2014 నుంచి మోడీ , అమిత్‌లు ఏంచేశారని నిలదీశారు. బీజేపీ, మోడీకి చిత్త శుద్ది ఉంటే ఎందుకు పార్లమెంట్‌లో పెట్టలేదని అడిగారు.

Varalakshmi Vratam: వరాలు కురిపించే వరమహాలక్ష్మి పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ఇదే..!


‘‘కేంద్రం తలచుకుంటే రాష్ట్రాల మీద పెట్టకుండా... పార్లమెంట్‌లో పెట్టి చట్టం తీసుకురావాలని చెప్పండి మందకృష్ణ.. మోడీ ఏమైనా సుప్రీం కోర్ట్ చీప్ జస్టిస్‌నా.. మాదిగలని తప్పు దోవ పట్టించకండి మందకృష్ణ.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు మద్దుతు ఇచ్చింది.. మేనిఫెస్టోలో పెట్టింది. ఎఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావలసింది సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చాక బీజేపీ పాలిత రాష్ట్రల సీఎంలు ఎందుకు స్పందించలేదా? మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయమని చెప్పండి మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణ వచ్చాక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.. దేశంలో మొట్టమొదటిగా తెలంగాణలో ఏఎస్సీ వర్గీకరణ చేస్తుంది’’ అని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?

KTR: అప్పుడు కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 04:42 PM