CPI Narayana: వన్ నేషన్ పేరిట హక్కులను కాలరాస్తున్న కేంద్రం
ABN , Publish Date - Sep 30 , 2024 | 12:32 PM
కమర్షియల్ కాంప్లెక్స్‌లు అక్రమంగా ఉంటే కూల్చాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. పేదలకు అన్యాయం చేయొద్దని తెలిపారు. భారత దేశంలో మౌలిక సదుపాయాల కొసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. హైవేలకు , ఎక్స్‌ప్రెస్ హైవే లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అయితే... ఎక్స్‌ప్రెస్ హైవేలో సైడ్స్‌లో చాలా హైట్‌లో గోడలు కడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు.
హైదరాబాద్: వన్ నేషన్ పేరిట హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శలు చేశారు. వన్‌నేషన్ పేరుతో హక్కులను కాలరాస్తు ఆర్డినెన్సు లు తీసుకొచ్చే ఆలోచనలను కేంద్రం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదే జరిగితే ప్రజాస్వామ్యం ఉండదని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోందని ఆరోపించారు.
ALSO READ: Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం
ఈ విషయంపై దేశవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని వార్నింగ్ ఇచ్చారు. నేపాల్‌లో అధిక వర్షాల ప్రభావం బీహార్ మీద పడిందని చెప్పారు. దాన్ని పరిశీలించడానికి కేంద్ర పార్టీ బృందం వెళ్తోందని తెలిపారు. అక్కడ ఎలాంటి సహాయచర్యలు చేపట్టాలనే దానిపై సమావేశంలో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు.. హైడ్రాపై నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైడ్రా చాలా హడావుడి చేస్తోందన్నారు. వికారాబాద్‌లో ఫిరంగి నాలానీ ప్రక్షాళన చేయాలని గతంలో వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ర్యాలీ చేపట్టామని గుర్తుచేశారు.
ALSO READ: KTR: పంచాయతీల్లో పాలన గాడి తప్పింది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు
చెరువులు, కుంటలు ఉంటే భూ గర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అక్రమ నిర్మాణాలు కూల్చితే పెద్దగా సమస్యే లేదని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు.. కొంతమంది అడ్డు పడుతారు.. సమస్య ఉంది కాబట్టి వ్యతిరేకిస్తారని అన్నారు. నిర్వాసితులను కొత్త ఇళ్లలోకి తరలించిన తర్వాత కూల్చాలని సూచించారు. పేదలకు ప్రత్యామ్నాయాలు చూపకుండా కూల్చోద్దని కోరారు. ఫిరంగి నాలాను ప్రక్షాళన చేయాలని అన్నారు.
కమర్షియల్ కాంప్లెక్స్‌లు అక్రమంగా ఉంటే కూల్చాల్సిందేనని అన్నారు. పేదలకు అన్యాయం చేయొద్దని తెలిపారు. భారత దేశంలో మౌలిక సదుపాయాల కొసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. హైవేలకు , ఎక్స్‌ప్రెస్ హైవే లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అయితే... ఎక్స్‌ప్రెస్ హైవేలో సైడ్స్‌లో చాలా హైట్‌లో గోడలు కడుతున్నారని వివరించారు. రైతుల భూములు చుట్టూ ఉంటాయని... వారు ఎక్కడ నుంచి నడవాలని ప్రశ్నించారు. తాత్కాలిక ఉపశమనం కోసం అక్కడక్కడ గ్యాప్ ఇస్తున్నారని చెప్పారు. కానీ తమ డిమాండ్ మొత్తం దేశవ్యాప్తంగా ఎక్స్ ప్రెస్ వేలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనేదే ప్రధాన డిమాండ్ అని తెలిపారు. సర్వీస్ రోడ్‌లో ఉండాల్సిందేనని చెప్పారు. అభివృద్ధి జరగాలి.. అంటే... అదాని అభివృద్ధి కాదని.. అందుకే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి లేఖ రాశామని తెలిపారు. రైతులకు అన్యాయం చేస్తే... తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని సీపీఐ నారాయణహెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్
ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ
Read Latest Telangana News And Telugu News