Share News

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:02 AM

Telangana: దివంగత బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్‌ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. ప్రస్తుతం టిప్పన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్, మార్చి 1: దివంగత బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్‌చెరు పోలీసులు (Patancheru Police) గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్‌ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఆర్‌ఆర్‌పై ముందు వెళ్తున్న టిప్పర్‌ను లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగినప్పటికీ టిప్పర్ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు.

కాగా.. ఫిబ్రవరి 27న పటాన్‌చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని రింగ్‌రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు.. గుర్తుతెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకెళ్లి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందువైపు ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న ఆమె పీఏ ఆకాశ్‌ (26) తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్లూ విరిగిపోవడంతో ఆయన కారులోనే ఇరుక్కుపోయారు. డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్‌ పెట్టుకున్నా, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా.. ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే లాస్య తండ్రి మాజీ ఎమ్మెల్యే జి.సాయన్న (Former MLA G. Sayanna) గత ఏడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మరణించారు. ఆయన ప్రథమ వర్థంతి జరిగి నాలుగు రోజులు గడవక ముందే కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

వెంటాడిన మృత్యువు

లాస్య నందిత ఎమ్మెల్యేగా పదవిని చేపట్టి కనీసం ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. ఆమెకు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయట పడ్డారు. ఆ తరువాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవ సారి‌ ప్రమాదానికి గురయ్యారు. అయితే గాయాలతో ఎమ్మెల్యే బయటపడ్డారు. అయితే మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లాస్య నందిత మృతి చెందారు.

YS Viveka: వివేకా హత్య కుట్రదారులెవరో బయటపెట్టనున్న సునీతారెడ్డి..

TDP: నా సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 01 , 2024 | 12:15 PM