Share News

CV Anand: శాంతిని నెలకొల్పటంలో పీస్ కమిటీ సభ్యుల పాత్ర కీలకం

ABN , Publish Date - Nov 01 , 2024 | 05:50 PM

పీస్ వెల్ఫేర్ కమిటీలో యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. ఇటీవల నగరంలో జరిగిన సున్నిత, మతపరమైన సమస్యలపై పరస్పరంగా చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

CV Anand: శాంతిని నెలకొల్పటంలో పీస్ కమిటీ సభ్యుల పాత్ర కీలకం

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శాంతిని నెలకొల్పటంలో పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కీలక రోల్ పోషిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ఇవాళ(శుక్రవారం) బంజారాహిల్స్‌లోని కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్‌లో నగరంలోని అన్ని జోన్‌ల నుంచి వచ్చిన సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీవీ ఆనంద్ చర్చించారు. ఇటీవల నగరంలో జరిగిన సున్నిత, మతపరమైన సమస్యలపై పరస్పరంగా చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.


శాంతి భద్రతలను పరిరక్షించడానికి, స్థానిక పోలీసులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ ఖ్యాతిని కాపాడేందుకు పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల అవిశ్రాంత కృషిని కొనసాగించాలని కోరారు. పీస్ వెల్ఫేర్ కమిటీలో యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనంతరం ముగింపు కార్యక్రమంలో పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ పోలీసులకు మద్దతుగా ఉంటూ రాబోయే పండుగలను శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా చూడాలని కోరారు.


ANAND-1.jpg

సమాజంలోని సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్మూలించడానికి, ప్రజల్లో సామరస్య భావం, ఐక్యత నెలకొల్పే విధంగా కమ్యూనిటీ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తామని కమిటీ ప్రతిజ్ఞ చేసింది. పీస్ వెల్ఫేర్ కమిటీ, పోలీసుల మధ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని అన్నారు, ఏదైనా శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు ఈ పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల ద్వారా సమస్యను సులువుగా పరిష్కరించవచ్చని తెలిపారు. వివిధ మత సమూహాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.


అలాగే శాంతిని నెలకొల్పటానికి నివారణ చర్యలో భాగంగా పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సమాజంలో ఉద్రిక్తతలను పెంచే తప్పుడు సమాచారం, పుకార్లతో జరిగే ప్రభావాలపై అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ANAND-2.jpg


ఈ మధ్య నగరంలో కొంతమంది వ్యక్తుల చెడు చేష్టలతో కలిగిన దుష్పరిణామాలపై, పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అందరు కలిసి ఏకగ్రీవంగా ఖండించారు. కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్, అడిషనల్ సీపీ, L&O, హైదరాబాద్, సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పీ. విశ్వ ప్రసాద్, ఐపీఎస్ అడిషనల్ సీపీ , ట్రాఫిక్, హైదరాబాద్ సిటీఎస్. చైతన్య కుమార్, ఐపీఎస్ డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ, కమిటీ వైస్ చైర్మన్ స్నేహ మెహ్రా, ఐపీఎస్, డీసీపీ సౌత్ జోన్, హైదరాబాద్ సిటీ, కమిటీ కోఆర్డినేటర్ నగరంలోని L&O, ట్రాఫిక్, SB, టాస్క్‌ఫోర్స్, హెడ్ క్వార్టర్స్, ట్రైనింగ్, SMIT, హైదరాబాద్ సిటీ డీసీపీలు, కిషన్ శర్మ, సెంట్రల్ పీస్, వెల్ఫేర్ కమిటీ జనరల్ సెక్రటరీ, హఫీజ్ ముజాఫర్ హుస్సేన్, ఇతర ఆఫీస్ బేరర్లు, సుమారు 350 శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Seethakka:బీఆర్ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైంది.. మంత్రి సీతక్క విసుర్లు

Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..

Harirama jogaiah: మరో లేఖతో ముందుకొచ్చిన హరిరామజోగయ్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 05:53 PM