Share News

Cyber Fraudsters: సైబర్ నేరగాళ్ల నయా మోసం

ABN , Publish Date - Aug 11 , 2024 | 01:42 PM

సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాలను మోసం చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారని, మోసం చేసేందుకు కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ఓ తండ్రికి ఫోన్ చేసి మీ కూతురిని కిడ్నాప్ చేశామని ఒకడు, మహిళ పేరుతో డ్రగ్స్ సప్లై అవుతున్నామని మరొకడు ఫోన్ చేశాడు. జనాలను బురిడీ కొట్టించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

Cyber Fraudsters: సైబర్ నేరగాళ్ల నయా మోసం
cybder crime

హైదరాబాద్: సైబర్ కేటుగాళ్లు (Cyber Fraudsters) రెచ్చిపోతున్నారు. జనాలను మోసం చేసేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారని, మోసం చేసేందుకు కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ఓ తండ్రికి ఫోన్ చేసి మీ కూతురిని కిడ్నాప్ చేశామని ఒకడు, మహిళ పేరుతో డ్రగ్స్ సప్లై అవుతున్నామని మరొకడు ఫోన్ చేశాడు. జనాలను బురిడీ కొట్టించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.


CYBER CRIME2.jpg


నిర్మల్‌లో ఇలా..

నిర్మల్ జిల్లాలో ఓ తండ్రికి సైబర్ కేటుగాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బెదిరించాడు. భైంసా మండలం ఇలెగం గ్రామానికి చెందిన కాంబ్లే వెంకటేష్‌కి ఫోన్ వచ్చింది. ‘ట్రూ కాలర్‌లో చూస్తే పోలీసు అధికారి పేరు కనిపించింది. నిజమే కావొచ్చని ఆ తండ్రి అనుకున్నాడు. మీ కూతురు శృతి అని చెప్పడం ప్రారంభించాడు. పేరు ఎలా తెలుసుకున్నారో తెలియదు.. దాంతో తండ్రి షాక్ తిన్నాడు. మీ కూతురు డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నామని, నిమిషాల్లో రావాలని చెప్పాడు. లేదంటే కూతురిని కాల్చి చంపుతామని బెదిరించాడు. ఆ మొబైల్ నంబర్‌కు పోలీస్ అధికారి డీపీ ఉంది. దాంతో వెంకటేష్ భయపడ్డారు. తర్వాత ధైర్యం తెచ్చుకుని కూతురు చదువుతున్న భైంసా గురుకుల పాఠశాలకు ఫోన్ చేశాడు. కూతురు స్కూల్‌లో ఉంది అని’ తెలుసుకొని వెంకటేష్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.


CYBER CRIME2.jpg


ఆర్బీఐ పేరు చెప్పి మోసం

హైదరాబాద్‌లో ఓ వృద్దురాలికి ఇదే విధంగా ఫోన్ వచ్చింది. ‘80 ఏళ్ల వృద్దురాలికి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. మీ మొబైల్ నంబర్ నుంచి డ్రగ్స్ పార్సిల్ అవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డ్రగ్స్ వెళుతున్నాయని చెప్పారు. మీ మీద కేసు నమోదవుతుందని బోల్తా కొట్టించారు. మీ డబ్బులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వెరిఫికేషన్ చేసి, తిరిగి డబ్బు పంపిస్తామని బుకాయించారు. ఈ కాల్ పోలీస్ కమిషనర్ నుంచి వచ్చిందని ఆ వృద్దురాలను నమ్మించారు. నిజమేనని ఆ వృద్దురాలు అనుకుంది. వెంటనే తన ఖాతాలో ఉన్న రూ.22 లక్షలను పంపించింది. ఆ తర్వాత ఎంతకు డబ్బులు తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే కలువడం లేదు. మోసపోయా అని’ ఆ వృద్దురాలు గ్రహించింది. విషయం కుమారుడికి చెప్పింది. వెంటనే అతను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


cyber crime.jpg


చదువుకున్న వారే..

కొత్త కొత్త పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. మాటల్లో పెట్టి కొందరు, బెదిరించి మరికొందరు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారు. వీరిలో చాలామంది చదువుకున్న వారే బాధితులు ఉన్నారు. బెదిరించడం చూసి.. వెంటనే నగదు బదిలీ చేస్తున్నారు. కాసేపయ్యాక తేరుకొని, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొత్త నంబర్లు ఎత్తొద్దని, ఓటీపీ చెప్పొద్దని సైబర్ పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు.


CYBER CRIME2.jpg

Updated Date - Aug 11 , 2024 | 01:51 PM