Share News

Fire Accident: జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదంపై ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ బాబు ఏం చెప్పారంటే?

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:49 PM

జూబ్లీహిల్స్(Jubilee Hills) జర్నలిస్టు కాలనీలోని IVY బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటు చేసుకుంది. భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌లో స్టోర్ రూమ్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భవనంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.

Fire Accident: జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదంపై ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ బాబు ఏం చెప్పారంటే?

హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills) జర్నలిస్టు కాలనీలోని IVY బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌లో స్టోర్ రూమ్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భవనంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భవనం అంతా పొగ కమ్ముకోవడంతో ఉద్యోగులంతా బయటకు పరుగులు తీయగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.


ఈ సందర్భంగా ఫిలింనగర్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.."ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం 01:30గంటల సమయంలో జర్నలిస్ట్ కాలనీలోని IVY బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు ఫోన్ వచ్చింది. సమాచారం అందుకున్న ఐదు నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకున్నాం. ప్రమాదానికి గురైన 16అంతస్తుల భవనంలో మెుదటి 6అంతస్తులు పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. నాలుగో ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. 10, 11అంతస్తుల్లో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మెటీరియల్, ఫర్నిచర్ వేస్టేజ్ యజమానులు 4వ ఫ్లోర్‌లో ఉంచారు. ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్‌ జరిగి వేస్టేజీకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చాం. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్ని ప్రమాదం సంబంధించిన వెంటనే ఉద్యోగులంతా బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది" అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Breaking: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

Justice Lakshminarayana: DRT అడ్వకేట్స్‌ అసోసియేష‌న్ లైబ్రరీ ప్రారంభించిన హైకోర్టు జ‌డ్జి జస్టిస్ ల‌క్ష్మీనారాయ‌ణ‌

Updated Date - Jun 25 , 2024 | 04:51 PM