Share News

Flooding of Projects: తెలంగాణలో ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద..

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:49 AM

Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్ట్,

Flooding of Projects: తెలంగాణలో ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద..
Telangana Projects

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో (Telangana) గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులలోకి ఇన్ల్ఫో అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

AP Politics: నెలరోజుల్లోనే వివాదాలు.. వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత..


అలాగే భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది.

మహబూబ్‌నగర్: జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు/ 1045 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 316.710 మీ/1,039.075 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.263 టీఎంసీలుగా (64.85%) కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2,06,000 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వచ్చి చేరింది. ఔట్‌ఫ్లో 1,97,914 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం వైపు 1,93,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Joe Biden: తదుపరి తరానికి దారి ఇవ్వాల్సిన సమయం ఇదీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్


భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహనం కొనసాగుతోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తివేసి 16038 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 15862 క్యూసెక్కులుగా ఉంది.

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది. దిగువన ఉన్న శబరి నది పోటు వేయడంతో గోదావరికి వరద స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం 46.6 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.


నిర్మల్: జిల్లాలోని బాసర వద్ద గోదావరి పొంగిపొర్లుతోంది. భారీగా ప్రవాహం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు, మత్స్యకారులు నది వైపు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో బాసర సరస్వతీ దేవి పుణ్యక్ష క్షేత్రం భక్తులు లేక బోసిపోతోంది.

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,71,580 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. బ్యారేజీకి వరద పోటెత్తడంతో అధికారులు 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

మంచిర్యాల: జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 13.533 టీఎంసీలు కాగా.. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉంది.


ఇవి కూడా చదవండి..

Andhra Pradesh Politics: జగన్ ఢిల్లీ వ్యూహం బెడిసికొట్టిందా..

KCR: అసెంబ్లీకి కేసీఆర్‌!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2024 | 09:55 AM