Share News

TG News: నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్..

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:58 AM

ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ(Jishnu Dev Varma) నేడు(మంగళవారం) ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.

TG News: నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్..
Telangana Governor Jishnu Dev Varma

వరంగల్: ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ(Jishnu Dev Varma) నేడు(మంగళవారం) ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 11:30గంటలకు రోడ్డుమార్గాన ములుగు చేరుకుంటారు. ఆ తర్వాత అరగంటపాటు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. మధ్యాహ్నం 12నుంచి ఒంటి గంట వరకూ పలువురు జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు.


అనంతరం జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన 25మంది రచయితలు, కళాకారులతో గవర్నర్ జిష్టు దేవ్ వర్మ కలెక్టరేట్‌లో సమావేశం అవుతారు. వారితో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి ఆయన పూజలు నిర్వహిస్తారు. అనంతరం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. జిల్లాకు చేరుకున్న తర్వాత గణపురం కోటగుళ్లను సందర్శించి గవర్నర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే సాయంత్రం గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు సందర్శించనున్నారు. అనంతరం హరిత రిసార్ట్‌కు చేరుకుని ఇవాళ రాత్రికి అధికారులతో కలిసి అక్కడే బస చేస్తారు. తిరిగి ఉదయం హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్తారు.


బుధ, గురువారం పర్యటన వివరాలు..

బుధవారం రోజున హనుమకొండలో పేరొందిన ప్రముఖ కాళాకారులతో గవర్నర్ జిష్టు దేవ్ వర్మ సమావేశం అవుతారు. అనంతరం భద్రకాళీ టెంపుల్, వేయిస్తంభాల గుడి, వరంగల్ ఖిల్లాను సందర్శిస్తారు. ఆ తర్వాత వరంగల్ నిట్ గెస్ట్ హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. మూడో రోజు పర్యటనలో భాగంగా జనగామ జిల్లాకు గవర్నర్ చేరుకుంటారు. అక్కడ కూడా ప్రముఖ కవులు, కళాకారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత కొలనుపాక సందర్శిస్తారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆయా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గవర్నర్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క మంత్రి సీతక్క అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Aug 27 , 2024 | 07:58 AM