Share News

Nagarjuna: ఎఫ్‌‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏంటీ..?

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:00 PM

రూల్ ఫర్ ఆల్ అంటోంది రేవంత్ సర్కార్. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని తేల్చి చెబుతోంది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాల లిస్ట్‌ను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌‌లో కొంతభాగం ఆక్రమించిందే. దాంతో ఆ నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు.

Nagarjuna: ఎఫ్‌‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏంటీ..?
Nagarjuna N Convention

రూల్ ఫర్ ఆల్ అంటోంది రేవంత్ సర్కార్. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించమని తేల్చి చెబుతోంది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకుంటుంది. అక్రమ నిర్మాణాల లిస్ట్‌ను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌‌లో కొంతభాగం ఆక్రమించిందే. దాంతో ఆ నిర్మాణాలను అధికారులు కూల్చి వేస్తున్నారు.


n-con.jpg


10 ఎకరాల్లో నిర్మాణం

హీరో నాగార్జున నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదాపూర్‌లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్‌‌ను నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో 2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఇందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇదే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.


ఎఫ్‌టీఎల్ అంటే..?

చెరువు లేదంటే జలాశయంలో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్య పరిధిని ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) అంటారు. వర్షాకాలంలో నీటితో నిండితే లేదంటే వరద నీటితో నిండితే ఎఫ్‌టీఎల్ నిర్ధారిస్తారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌ను నిర్మాణ సమయంలో నిర్ధారించారు. వర్షం లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తోంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా సరే.. నీళ్లు లేని సమయంలో వ్యవసాయం చేసుకోవచ్చు. నీరు ఉంటే ఆ భూములను వదిలేయాల్సి ఉంటుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టొద్దనే కఠిన నిబంధన ఉంది.


బఫర్ జోన్ అంటే..?

నది పరీవాహక ప్రాంతంలోకి వరదనీరు సక్రమంగా వస్తూనే.. కలుషితం కాకుండా ఉండాలి. ప్రతి నీటి వనరును, విస్తీర్ణం ఆధారంగా బఫర్‌జోన్‌‌గా నిర్ధారిస్తారు. 25 హెక్టార్లు, అంతకుమించి విస్తీర్ణంలో ఉన్న చెరువు, జలాశయాలు బఫర్‌జోన్‌ నిర్ధారణకు 30 మీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. జంట జలాశయాల పరిధి చుట్టూ ఎఫ్‌టీఎల్‌ను ఆనుకొని 30 మీటర్లు (వంద ఫీట్లు) బఫర్‌జోన్‌గా ఉంది. ఇక్కడ సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్రమే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో స్పష్టంగా ఉంది. నాగార్జున ఎన్ కన్వెక్షన్‌లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ రెండు ఉన్నాయి. ఆ క్రమంలోనే హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.


అక్రమ నిర్మాణమే..

హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2 రెండు ఎకరాల భూమి ఉంది. మొత్తం 3.12 ఎకరాల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:03 PM