Share News

Hanu Man: హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన.. మెచ్చుకున్న చిరంజీవి

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:57 PM

అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తెలిపారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చిరంజీవి తెలిపారు.

Hanu Man: హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన.. మెచ్చుకున్న చిరంజీవి

హైదరాబాద్: అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తెలిపారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ వేడుకలో మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని తెలిపారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని.. ఈ నెల 22వ తేదీన తన కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.

అయితే.. రామ మందిర ప్రారంభోత్సవం వేళ హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్‌పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నామని హను-మాన్ చిత్ర బృందం నిర్ణయాన్ని ప్రకటించింది. స్వామి కార్యం కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్న హను-మాన్ చిత్ర బృందాన్ని ఈ సందర్భంగా చిరంజీవి అభినందించారు.

కాగా.. హనుమాన్ మూవీ ఈ నెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం హనుమాన్ భక్తులు, సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 11:32 PM