Hyderabad: హైదరాబాద్‌లో మరో కంపెనీపై ఐటీ దాడులు..
ABN , Publish Date - Nov 18 , 2024 | 06:28 PM
షాద్‌నగర్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీ(MNC)కి రూ.300 కోట్ల విలువైన భూమిని స్వస్తిక్ రియల్టర్ కంపెనీ విక్రయించింది. అయితే దానికి సంబంధించిన వివరాలను కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో ఎక్కడా చూపలేదనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో స్వస్తిక్ గ్రూప్ సంస్థలపై ఆదాయపు పన్ను(IT) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడిన అధికారులు బేగంబజార్‌లోని స్వస్తిక్ మిర్చి కార్యాలయంతోపాటు బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్‌నగర్‌లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు.. ఆ సంస్థ మేనేజర్లు కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలపై సైతం దాడులు చేశారు. షాద్‌నగర్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీ(MNC)కి రూ.300 కోట్ల విలువైన భూమిని స్వస్తిక్ రియల్టర్ కంపెనీ విక్రయించింది. అయితే దానికి సంబంధించిన వివరాలను కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో ఎక్కడా చూపలేదనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు నడుమ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.