Share News

Ganesh Immersion 2024: గంగమ్మ ఒడిలోకి గణపయ్య.. మహాగణపతి నిమజ్జనం పూర్తి

ABN , First Publish Date - Sep 17 , 2024 | 07:02 AM

Ganesh Immersion 2024: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణేష్ శోభా యాత్ర కొనసాగుతోంది. అర్ధ రాత్రి తర్వాత కలశ పూజ అనంతరం ఖైరతాబాద్ గణేశుడు భారీ ట్రాలీపైకి ఎక్కాడు. మొత్తం రెండున్నర కిలో మీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర కొనసాగనుంది. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో ఏర్పాటైన మట్టి గణేష్ విశిష్ఠ పూజలు అందుకున్నాడు.

Ganesh Immersion 2024: గంగమ్మ ఒడిలోకి గణపయ్య.. మహాగణపతి నిమజ్జనం పూర్తి
Ganesh

Live News & Update

  • 2024-09-18T07:08:30+05:30

    2వ రోజు హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

    భాగ్యనగరం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం లోపు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపడుతోంది. కాగా ఇప్పటివరకు 1 లక్ష 3500 గణనాథుల నిమజ్జనాలు జరిగాయి. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5500 విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. ఇక అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయని అధికారులు తెలిపారు. గ్రేటర్‌లో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి.

  • 2024-09-17T19:10:17+05:30

    • మోజం జాహీ మార్కెట్ వద్ద భాగ్యనగర ఉత్సవ సమితి స్వాగత వేదిక

    • వేదికను సందర్శించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

    • వినాయక నిమజ్జనానికి వెళుతున్న వాహనాలకు స్వాగతం పలికిన ఈటల రాజేందర్

    • భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఈటల రాజేందర్

  • 2024-09-17T16:36:16+05:30

    బాలాపూర్ గణేషుడి నిమజ్జనం పూర్తి..

    బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం ముగిసింది. భక్తుల కోలాహలం మధ్య హుస్సేన్ సాగర్‌లో గణపయ్యను నిమజ్జనం చేశారు.

  • 2024-09-17T15:54:59+05:30

    సెక్రటేరియట్ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణేషుడు..

    బాలాపూర్ గణేషుడు ట్యాంక్‌‌బండ్ సమీపించాడు. సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నాడు. మరికాసేపట్లో బాలాపూర్ గణేషుడు కూడా గంగమ్మ చెంతకు చేరనున్నాడు.

  • 2024-09-17T15:10:49+05:30

    గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది: సీపీ సీవీ ఆనంద్‌

    విగ్రహాలు త్వరగా నిమజ్జనమయ్యేలా చూస్తున్నాం.

    ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.

    25 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశాం.

  • 2024-09-17T15:00:04+05:30

    మొజాంజాహి మార్కెట్ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణేషుడు..

    బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం గణేషుడు మొజాంజాహి మార్కెట్ వద్దకు చేరుకుంది. మరోవైపు పాతబస్తీ నుంచి వినాయక విగ్రహాలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. దీంతో అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ రోడ్ అంతా వినాయక విగ్రహాలు బారులు తీరాయి. ఇక రోడ్లకు ఇరువైపులా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు.. భక్తులకు మంచినీళ్లు, అన్నదానం, తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.

  • 2024-09-17T13:40:39+05:30

    • గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహాగణనాథుడు

    • విజయవంతంగా నిమజ్జనం పూర్తి

    • సూపర్ క్రేన్ ద్వారా సప్తముఖ మహాగణపతి నిమజ్జనం

  • 2024-09-17T13:35:57+05:30

    • నెమ్మదిగా క్రమక్రమంగా గంగ ఒడిలో కలుస్తున్న గణనాథుడు

    • మహాగణపతి నామస్మరణతో మార్మోగుతున్న పరిసర ప్రాంతాలు

      Untitled-2.jpg

  • 2024-09-17T13:27:25+05:30

    ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు విచ్చేశారు. భక్తజనంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

  • 2024-09-17T13:20:25+05:30

    ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జన సమయం ఆసన్నమైంది. మహాగణపిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు సూపర్ క్రేన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే చివరి పూజ జరుగుతుండగా.. క్రేన్ హుక్స్‌ని గణపయ్యకు సెట్ చేశారు.

  • 2024-09-17T12:56:39+05:30

    ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం..

    DGP-Jitender-Reddy.jpg

    • ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలిపారు.

    • వివిధ మత పెద్దలతో రెండు సార్లు కో ఆర్డినేషన్ మీటింగ్ లెవల్ జరిగింది.

    • సీపీ, డీసీపీ లెవల్‌లో కూడా మీటింగ్స్ పెట్టాము.

    • గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

    • బాలాపూర్ గణేశుడు ఇప్పటికే హైదరాబాద్ లిమిట్స్‌లో ఊరేగింపు కొనసాగుతుంది.

    • రాష్ట్ర వ్యాప్తంగా బైంసాతో పాటు మరి కొన్ని ప్రదేశాల్లో నిమజ్జనం పూర్తి అయింది.

    • ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు, ఏర్పాట్లు చేశాము.

    • ఖైరతాబాద్ బడా గణేష్ మరి కాసేపట్లో నిమజ్జనం జరుగుతుంది.

    • ఈరోజు రాత్రిలోగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

    • చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా టైం టు టైం మేము అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళతాం.

    • డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం.

    • హైదరాబాద్‌ సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి టీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం.

    • హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది.

    • మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయి.

    • మంగళవారం వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

  • 2024-09-17T12:49:02+05:30

    క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న మహాగణపతి..

    ఖైరతాబాద్ గణేషుడు మరికాసేపట్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. మహాగణపతి నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూపర్ క్రేన్ వద్దకు చేరుకున్నాడు. క్రేన్ నెంబర్ 4ను మహాగణపతి సమీపించాడు. మరికాసేపట్లో గణపయ్యకు వీడ్కోలు పలకనున్నారు.

  • 2024-09-17T12:27:17+05:30

    ఆల్‌టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ..

  • 2024-09-17T12:16:44+05:30

    మరికాసేపట్లో గంగమ్మ ఒడికి మహాగణపతి

    ఖైతరాబాద్ గణేషుడి నిమజ్జనం మరికాసేపట్లో జరుగనుంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు మహాగణపతి చేరుకున్నాడు. మరికాసేపట్లో గణేషుడి నిమజ్జనం జరుగనుంది.

    Khairatabad-Ganesh-2.jpg

  • 2024-09-17T12:10:28+05:30

    ఖైరతాబాద్ వినాయకుడికి హుందీ ఆదాయం ఎంతో తెలుసా..?

    తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వినాయకుడు ఖైరతాబాద్ గణనాథుడు. ఈ ఏడాది 70 అడుగులు సప్తముఖ మహాశక్తి గణపతిని నెలకొల్పారు నిర్వాహకులు. తొమ్మిది రోజులు పూజలందుకున్న గణపయ్యకు భక్తులు భారీ ఎత్తున కానుకలు సమర్పించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు, ప్రకటనలు, హోర్డింగ్స్ ‌ద్వారా రూ. 40 లక్షలు ఆదాయం వచ్చింది. మొత్తంగా మహాగణపతికి కోటీ 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.

  • 2024-09-17T12:10:27+05:30

    సచివాలయం వద్దకు చేరుకున్న‌ ఖైరతాబాద్ బడా గణేష్

    • భక్తులతో నిండిపోయిన సచివాలయం - ఎన్టీఆర్ మార్గ్

    • ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

    • భక్తులను కంట్రోల్ చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తోన్న పోలీసులు

  • 2024-09-17T11:13:21+05:30

    Balapur Laddu: ఏ సంవత్సరంలో ఎంత పలికిందంటే..

    • 1998లో రూ. 51,000

    • 1999లో రూ. 65,000

    • 2000లో రూ. 66,000

    • 2001లో రూ. 85,000

    • 2002లో రూ. 1.05,000

    • 2003లో రూ. 1,55,000

    • 2004లో రూ. 2,01,000

    • 2005లో రూ. 2,08,000

    • 2006 లో రూ. 3 లక్షలు

    • 2007లో రూ. 4.15 లక్షలు

    • 2008లో రూ. 5.07 లక్షలు

    • 2009లో రూ. 5.10 లక్షలు

    • 2010లో రూ. 5.35 లక్షలు

    • 2011లో రూ. 5.45 లక్షలు

    • 2012లో రూ. 7.50 లక్షలు

    • 2013లో రూ. 9.26 లక్షలు

    • 2014లో రూ. 9.50 లక్షలు

    • 2015లో రూ. 10.32 లక్షలు

    • 2016లో రూ. 14.65 లక్షలు

    • 2017లో రూ. 15.60 లక్షలు

    • 2018లో రూ. 16.60 లక్షలు

    • 2019లో రూ. 17.60 లక్షలు

    • 2021లో రూ. 18.90 లక్షలు

    • 2022లో రూ. 24.60 లక్షలు

    • 2023లో రూ. 27 లక్షలు

  • 2024-09-17T11:01:58+05:30

    మత సామరస్యానికి ప్రతీక వినాయక చవితి

    • మత సామరస్యానికి ప్రతీకమైన పండుగ వినాయక చవితి

    • వేలంలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు.

    • కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భట్‌పల్లిలో వినాయక వేలం పాటలో రూ.13,216లకు లడ్డూను దక్కించుకున్న అఫ్జల్ దంపతులు.

    Muslim-Couple.jpg

  • 2024-09-17T10:52:50+05:30

    బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నది ఈయనే..

    బాలాపూర్ లడ్డూను బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. వేలంపాటలో 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు.

    Balapur-Laddu-Buyer.jpg

  • 2024-09-17T10:48:42+05:30

    రికార్డ్ ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

    బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈసారి కూడా రికార్డ్ సృష్టించింది. గతేడాది కంటే అధిక ధరకు అమ్ముడుపోయింది. బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. రూ. 30 లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్నారు.

  • 2024-09-17T10:45:15+05:30

    వినాయక శోభాయాత్రలో డ్యాన్స్ చేసిన సీఎం మనవడు..

  • 2024-09-17T10:37:41+05:30

    Big Alert: ఈ రూట్స్ అన్నీ క్లోజ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే..

  • 2024-09-17T10:34:48+05:30

    బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఉన్న భక్తులు

    1.లింగాల దశరథ్ గౌడ్ - కర్మన్ ఘాట్

    2.అర్బన్ గ్రూప్

    సామా ప్రణీత్ రెడ్డి - సాహెబ్ నగర్

    3.సందీప్ రెడ్డి

    ఎస్ వై ఆర్ ఫౌండేషన్ పోచారం

    4.కొలన్ శంకర్ రెడ్డి - బాలాపూర్

    5.శ్రీ గీత డైరీ - లక్ష్మీనారాయణ - నాదర్గుల్

    6.సామ కార్తీక్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బ్రదర్

  • 2024-09-17T10:12:50+05:30

    ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట..

    Balapur-Laddu.jpg

  • 2024-09-17T10:08:04+05:30

    వినాయక నిమజ్జనం వేళ టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన..

  • 2024-09-17T10:03:50+05:30

    • కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకోనున్న ఖైరతాబాద్ మహా గణతి

    • ఖైరతాబాద్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • జూబ్లీహిల్స్ నివాసం నుంచి గన్ పార్క్ బయలుదేరిన సీఎం

    • మరికాసేపట్లో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు

    • అనంతరం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

  • 2024-09-17T09:02:54+05:30

    • టెలిఫోన్ భవన్ దాటిన ఖైరతాబాద్ మహాగణపతి

  • 2024-09-17T09:00:58+05:30

    • నిమజ్జనం లో రాజకీయ నేతల పాటలు

    • హైదరాబాద్‌లో నిమజ్జనంలో రాజకీయ నేతల పాటలు

    • మూడు రంగుల జెండా పట్టి సాంగ్ ప్లే చేసిన గణేష్ భక్తులు

    • వెంటనే దేఖ్ లేంగే సాంగ్ ప్లే చేసిన మరో యూత్ సభ్యులు

    • డీజే పాటలను నిలిపేసి ప్రశాంతంగా నిమజ్జనం చేస్తున్న పోలీసులు

  • 2024-09-17T08:59:49+05:30

    • హుస్సేన్ సాగర్ వైపు ఒడి ఒడిగా అడుగులు వేస్తున్న ఖైరతాబాద్ గణేషుడు

    • లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

  • 2024-09-17T08:58:57+05:30

    హైదరాబాద్‌లో నేడు లక్ష గణేష్ విగ్రహాల నిమజ్జనం

    • హైదరాబాద్‌లో కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి

    • గ్రేటర్‌లో ఈ ఏడాది లక్షా 40 వేల గణేష్ విగ్రహాల ఏర్పాటు

    • ఇప్పటికే నిమజ్జనం అయిన 40 వేల విగ్రహాలు

    • నేడు లక్ష గణేష్ విగ్రహాల నిమజ్జనం

    • హుస్సేన్ సాగర్‌లోనే 30 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం

  • 2024-09-17T08:33:26+05:30

    1 గంటలోపు మహాగణపతి నిమజ్జనం

    • ఒంటి గంటలోపు పూర్తి కానున్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

    • కాసేపట్లో టెలిఫోన్ భవన్ చేరుకోనున్న బడా గణేష్

    • లక్డీకాపూల్ నుంచి తెలుగుతల్లి ప్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ రూట్లలో ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు

    • ఖైరతాబాద్ భారీ గణపతి వచ్చే మార్గంలో రూట్ క్లియర్ చేసిన పోలీసులు

    • ఖైరతాబాద్ గణపతి వెళ్లాకే మిగిలిన గణపతి నిమజ్జనాలకు అనుమతి

  • 2024-09-17T08:12:57+05:30

    గణేశ్ లడ్డూ వేలంలో రికార్డులు బద్దలు..

    • రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని ‘కీర్తి రిచ్ మండ్ విల్లాస్’లో గణేశ్ లడ్డూ వేలం రికార్డు

    • ఏకంగా రూ.1 కోటి 87 లక్షలు ధర పలికిన గణపతి లడ్డూ ప్రసాదం

  • 2024-09-17T07:49:22+05:30

    • మహా గణపతిని తీసుకెళ్తున్న వాహనానికి ముందు రెండంచెల రోప్ పార్టీలు ఏర్పాటు

    • 700 మంది పోలీసులతో భారీ బందోబస్త్

    • సరికొత్త రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ మహా గణపతి

    • ఈ ఏడాది హుండీ ఆదాయం రూ.1 కోటి 10 లక్షలుగా నమోదు

  • 2024-09-17T07:24:15+05:30

    నెమ్మదిగా నిమజ్జనాలు

    • హైదరాబాద్ నగరంలోని తెలుగుతల్లి ప్లైఓవర్ వద్దకు భారీగా చేరుకుంటున్న గణనాథులు

    • లక్డీకాపూల్ వరకూ భారీగా ట్రాఫిక్ జామ్

    • మందకొడిగా సాగుతున్న నిమజ్జనాలు

    • రాత్రి నుంచి క్యూలైన్లలో బారులు తీరిన వాహనాలు

  • 2024-09-17T07:23:13+05:30

    బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఉన్న భక్తులు వీళ్లే..

    1. లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్)

    2. అర్బన్ గ్రూప్ - సామా ప్రణీత్ రెడ్డి (సాహెబ్ నగర్)

    3. సందీప్ రెడ్డి - ఎస్‌వై‌ఆర్ ఫౌండేషన్ (పోచారం)

    4. కొలన్ శంకర్ రెడ్డి (బాలాపూర్)

    5. శ్రీ గీత డైరీ-లక్ష్మీనారాయణ (నాదర్గుల్)

    6. సామ కార్తీక్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బ్రదర్స్

  • 2024-09-17T07:07:00+05:30

    మధ్యాహ్నం 2 గంటలలోగా నిమజ్జనం

    • అర్ధ రాత్రి తర్వాత కలశ పూజ అనంతరం భారీ ట్రాలీపైకి ఎక్కిన  ఖైరతాబాద్ గణేశుడు

    • మొత్తం రెండున్నర కిలో మీటర్ల మేర సాగనున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

    • ఖైరతాబాద్ , సెన్సేషనల్ థియేటర్ , రాజ్ దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ వరకు కొనసాగనున్న శోభాయాత్ర

    • ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

    • హుస్సేన్ సాగర్‌లో మధ్యాహ్నం 2 గంటల లోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేలా ప్లాన్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు

  • 2024-09-17T07:01:51+05:30

    • ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణేష్ శోభా యాత్ర మొదలైంది

    • నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి

    • 70 ఏళ్ల సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో భారీ మట్టి గణేష్ ఏర్పాటు

    • ఈ ఏడాది శ్రీ సప్త ముఖ మహాశక్తి గణపతిగా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి

    • కుడి వైపు శ్రీనివాస కళ్యాణం ఎడమ వైపు పార్వతి కళ్యాణం..

    • భారీ విగ్రహం కాళ్ల వద్ద అయోధ్య బాలరాముడి విగ్రహం ఏర్పాటు

    • పర్యావరణహితంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ఏర్పాటు..

    • ఆలస్యంగా ప్రారంభం అయినా అనుకున్న సమయానికి విగ్రహం తయారీ పూర్తి

    • ఈ ఏడాది కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి బడా గణేష్ విగ్రహం ఏర్పాటు

    • ఈ ఏడాది కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్ బరువు సుమారు 40 నుంచి 50 టన్నులు

    • పెద్ద ఎత్తున ఐరన్, పిచూ.. మట్టి వినియోగం..