Breaking: ఆర్ఎస్పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్లో మరో వికెట్ ఔట్..!
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:43 PM
Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు.
Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు. తన ఓటమికి ప్రవీణ్ కుమార్ కూడా కారణమనే భావన కోనప్పలో ఉంది. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్(KCR) తనతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా పొత్తు నిర్ణయం తీసుకున్నారని అసంతృప్తితో ఉన్నారు.
ఇవాళ హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కోనేరు కోనప్ప. మంగళవారం నాడు తన అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించిన కోనేరు కోనప్ప.. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళో రేపో పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్నారు కోనప్ప. అనంతరం ఈ నెల 12వ తేదీన గానీ.. 15వ తేదీన గానీ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారట. కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడటానికి ప్రధాన కారణం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడమే అని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీల్లో చేరుతుండగా.. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం బీజేపీ, కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో నేతలు ఇప్పటికే జెండా మార్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.