TS NEWS: పీవీ అన్ని రంగాల్లో మార్పులు తీసుకొచ్చారు: మంత్రి శ్రీనివాసరెడ్డి
ABN , Publish Date - Feb 09 , 2024 | 06:18 PM
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించ దగిన విషయమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
హైదరాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించ దగిన విషయమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు జాతి ముద్దుబిడ్డ, బహుబాషా కోవిదుడైన పీవీ నరసింహారావు... ప్రధానిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివని, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత పీవీదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేడు మనదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అందుకు ఆరోజు ఆయన వేసిన పునాదులే కారణమని తెలిపారు. ప్రధానిగా పీవీ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. అన్ని రంగాలల్లో మార్పులకు శ్రీకారం పలికిన వ్యక్తి పీవీ నరసింహరావు అని తెలిపారు. దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు మన తెలుగు బిడ్డకు దక్కడం తెలుగు జాతికీ గర్వకారణం అని మంత్రి అన్నారు.