Share News

Seethakka: ఆడబిడ్డలను ఎగరనిద్దాం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:03 PM

Telangana: సోదరీ సోదరుల మధ్య అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. రాఖీ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Seethakka: ఆడబిడ్డలను ఎగరనిద్దాం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు
Minister Seethakka

హైదరాబాద్, ఆగస్టు 19: సోదరీ సోదరుల మధ్య అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. రాఖీ పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మాయిలను నువ్వు గౌరవించుకోవాల్సిన అవసరాన్ని రాఖీ పండుగ చాటి చెబుతుందన్నారు. మహిళా భద్రతకు పాటుపడదామని రాఖీ పండుగ సందర్భంగా అందరూ ప్రతినభూనాలన్నారు.

CM Chandrababu: చంద్రబాబు చేతిలో కెమెరా.. క్లిక్‌మన్న ఫొటోలు


మహిళలను గౌరవించుకోవడం మన సంస్కృతి అని అన్నారు. ప్రతి అడపడుచు, అన్నదమ్ములతో ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుకునే పండగ రాఖీ పండగ అని అన్నారు. సోదరులు అందరూ బాగుండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని తెలిపారు. సమాజంలో వస్తున్న రకరకాల మార్పులు వల్ల మహిళల పట్ల అనేక రకాల హింస జరుగుతుందన్నారు.

AP News: మాక్ పోలింగ్ వ్యవహారం.. బాలినేని పిటిషన్‌పై ముగిసిన ఇవాళ్టి విచారణ


ప్రతి సోదరుడు తన సోదరికి సమాజంలో ఎలా సెక్యూరిటీ, గౌరవం పొందాలి అనుకుంటారో.. అలాగే ప్రతి ఒక్కరూ తమ అక్క చెల్లమ్మల మాదిరి సమాజంలో ప్రతి ఆడబిడ్డను గౌరవించాలని అన్నారు. ప్రతి మహిళను మన ఇంటి బిడ్డగా చూస్తే అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగవన్నారు. ‘‘ఆడబిడ్డలకు స్వేచ్చగా తిరేగే అవకాశం ఇద్దాం.. ఎదగనిద్దాం’’ అంటూ అందరికీ రాఖి పండగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంకు కూడా రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపానని.. చాలా సంతోషంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాగా.. జూబ్లీహిల్స్‌లో నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కతో పాటు పలువురు రాఖీ కట్టారు.


ఇవి కూడా చదవండి..

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Abhishek Singhvi: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 03:30 PM