Share News

Nalgonda: ‘ముఖ్యమంత్రి ఉత్తమ్ గారూ’.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:58 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారూ అని సంభోదించారు. అంతేకాదు.. తన నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. ఈ విషయాన్ని తన అమ్మ చెప్పిందన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్‌లో..

Nalgonda: ‘ముఖ్యమంత్రి ఉత్తమ్ గారూ’.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్..
MLA Komatireddy Rajagopal Reddy

యాదాద్రి భువనగిరి, ఆగష్టు 30: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారూ అని సంభోదించారు. అంతేకాదు.. తన నాలుకపై నల్లటి మచ్చలు ఉన్నాయని.. తాను ఏమి అంటే అది జరిగి తీరుతుందన్నారు. ఈ విషయాన్ని తన అమ్మ చెప్పిందన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి భవిష్యత్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పక అవుతారని చెప్పుకొచ్చారు. భువనగిరిలో పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. అయితే, ఈ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్‌లో సంచలనంగా మారాయి.


కాగా, శుక్రవారం నాడు భువనగిరి న్యూ డైమన్షన్ స్కూల్‌లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.


సమావేశం అనంతరం భువనగిరి మండలం అనాజీపురం శివారులోని బూనాది గాని కాల్వను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కాల్వ పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం ఫోకస్..

ఇదిలాఉంటే.. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలన్నారు. భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు. అలాగే ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతరంగా వదిలేయడానికి వీళ్లేదని, ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం.


Also Read:

స్పీకర్ అయ్యన్న సంచలన ప్రకటన...

పవన్‌ ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయరు!

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 30 , 2024 | 05:58 PM