Share News

TS News: సనత్‌నగర్‌లో ముగ్గురి మృతి కేసులో మిస్టరీ ఇదే!

ABN , Publish Date - Jul 23 , 2024 | 01:57 PM

Telangana: నగరంలోని సనత్‌నగర్‌ జెక్ కాలనీలో ఓ ఇంట్లోని బాత్రూంలో ముగ్గురి మృతి కలకలం రేపింది. ఈనెల 21న (ఆదివారం) బాత్రూంలో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందారు. అయితే వీరి మృతికి గ్యాస్ గీజరే కారణమని భావిస్తున్నారు. అందులోని విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ను పీల్చినందునే ముగ్గురు మరణించి ఉంటారని

TS News: సనత్‌నగర్‌లో ముగ్గురి మృతి కేసులో మిస్టరీ ఇదే!
Sanatnagar

హైదరాబాద్, జూలై 23: నగరంలోని సనత్‌నగర్‌ (Sanathnagar) జెక్ కాలనీలో ఓ ఇంట్లోని బాత్రూంలో ముగ్గురి మృతి కలకలం రేపింది. ఈనెల 21న (ఆదివారం) బాత్రూంలో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందారు. అయితే వీరి మృతికి గ్యాస్ గీజరే కారణమని భావిస్తున్నారు. అందులోని విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ను పీల్చినందునే ముగ్గురు మరణించి ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్ధారణలో తేలిందని సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు.

MP Balashowry: ఏపీ ప్రజల కల నెరవేరబోతోంది... కేంద్రానికి ధన్యవాదాలు


సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకింగ్ సొల్యూషన్స్ సంస్థలో బిజినెస్ హెడ్గా పనిచేసే ఆర్.వెంకటేష్(59), ఆయన భార్య మాధవి(52), కుమారుడు హరికృష్ణ (25).. జెక్ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం ఉదయం తమ ప్లాట్ బాత్రూంలో వీరు ముగ్గురు మృతి చెందారు. అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై మంత్రి నారా లోకేశ్ స్పందన


అయితే మానసికస్థితి సరిగాలేని కుమారుడు హరికృష్ణకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పక్క ఫ్లాటకు చెందిన వారు ఊరెళ్తుండగా.. ఈ ముగ్గురు వీడ్కోలు చెప్పారు. తర్వాత కొన్ని నిమిషాలకే కుమారుడికి స్నానం చేయించడానికి తల్లిదండ్రులిద్దరూ బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టారు. గీజర్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ పీల్చడంతో ఆ ముగ్గురూ స్పృహతప్పి క్షణాల్లోనే మరణించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.


ఇవి కూడా చదవండి..

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

KTR: అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 02:05 PM