Share News

Hyderabad: 2012లో ఇలా.. 2024లో ఇలా.. ఫొటో షేర్ చేసిన బీజేపీ

ABN , Publish Date - Aug 26 , 2024 | 09:31 PM

బండ్లగూడ మండలం సలకం చెరువును ఒవైసీ బ్రదర్స్ ఆక్రమించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ చోట ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని చెబుతోంది. గూగుల్ మ్యాప్ ఫొటోలతో ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి ఉండేదని.. 2024లో హఠాత్తుగా ఫాతిమా ఒవేసీ కాలేజీ ఏర్పడిందని వివరించింది.

Hyderabad:  2012లో ఇలా.. 2024లో ఇలా.. ఫొటో షేర్ చేసిన బీజేపీ
Owaisi College

హైదరాబాద్: హైదరాబాద్ శివారులో గల చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఎన్ కన్వెషన్ సెంటర్ కూల్చి వేయడంతో ఒక్కసారిగా చర్చకు వచ్చింది. ఆ తర్వాత మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ గురించి ఒక్కటే చర్చ. చెరువును ఆక్రమించి కాలేజీ నిర్మించారని.. 2012, 2024లో సలాకం చెరువు ఎలా ఉండేదో ఫొటోలు సోషల్ మీడియాలో బీజేపీ పోస్ట్ చేసింది. ఆ కాలేజీని కూల్చివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించింది.


Hydra.jpg


ఆక్రమణ

బండ్లగూడ మండలం సలకం చెరువును ఒవైసీ బ్రదర్స్ ఆక్రమించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ చోట ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని చెబుతోంది. గూగుల్ మ్యాప్ ఫొటోలతో ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి ఉండేదని.. 2024లో హఠాత్తుగా ఫాతిమా ఒవేసీ కాలేజీ ఏర్పడిందని వివరించింది. ఆ రెండింటిని వివరిస్తూ ఫొటో షేర్ చేసింది. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూతురు ఫాతిమా అనే సంగతి తెలిసిందే. కూతురు పేరుతో అక్బరుద్దీన్ కాలేజీ ఏర్పాటు చేసి, పేదలకు విద్యను అందిస్తున్నారు.


దయచేసి కూల్చొద్దు

బీజేపీ నేతల వరస ఫిర్యాదులతో అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘దయచేసి ఆ కాలేజీ కూల్చొద్దు. పేద విద్యార్థులకు ఆ కాలేజీ వరం. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ వైరంతో తాము నిర్మించిన కాలేజీ కూల్చాలని కోరడం సరికాదు. వేలాది మంది విద్యాబుద్దులు నేర్చుకునే స్కూల్ నేలమట్టమైతే వారి బంగారు భవిష్యత్ నాశనం అవుతుంది. కావాలంటే నన్ను టార్గెట్ చేయండి.. అవసరమైతే బుల్లెట్ల వర్షం కురిపించాలి అని’ అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు.

ఇవి కూడా చదవండి

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

Kodandareddy: హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 09:31 PM