Sakshi Bad Manner: వెంటాడుతున్న కొద్దీ వెనక్కి పారిపోతున్న సాక్షి భూతం..
ABN , Publish Date - Oct 28 , 2024 | 10:58 AM
రోత పత్రిక సాక్షి చేసిన తప్పులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టింది. తొలుత ట్యాగ్‌ను గుర్తించి ప్రజల ముందు ఎండగట్టింది. తర్వాత డీఎస్ఎన్జీ ఫ్రీక్వెన్సీ ఇష్యూ.. ఆ తర్వాత యాప్‌ను కూడా వదల్లేదు. ఒక్కో తప్పును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెగ.. రోత పత్రిక తోక ముడిచింది.
అధికారం ఉందనే అహంతో ఐదేళ్లపాటు తాము ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరించిన సాక్షి దొంగతనాన్ని ప్రజల ముందు ఉంచడంతో వెనక్కి తగ్గి పారిపోతుంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కొట్టిన దెబ్బకు సాక్షి అన్నింటిని వదిలిపెట్టిపోతుంది. ఇప్పటివరకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి చెందిన వెబ్సైట్, యాప్, డీఎస్ఎన్జీ ఫ్రీక్వెన్సీ హ్యాక్ చేసిన చౌర్యాన్ని ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించడంతో సాక్షి భూతం తోకముడిచింది. మొదట ఎదురుదాడికి దిగేందుకు రోత పత్రిక ప్రయత్నించింది . పబ్లిక్‌గా హ్యాకింగ్ ద్వారా చౌర్యానికి పాల్పడిన సాక్షిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయడం, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో అన్నింటిని వదిలిపెడుతోంది.
ఇది కూడా చదవండి
Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు
లేని నైతిక విలువలు
నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, పత్రికా విలువలను గాలికొదిలేసిన సాక్షి తాను శుద్ద పూసనని చెప్పుకునందుకు హ్యాకింగ్ ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా సాక్షి దొంగబుద్ధి ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. మొదట వెబ్ సైట్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ తొలగించిన సాక్షి, ఆ తరువాత డీఎస్ఎన్జీ ఫ్రీక్వేన్సీ హ్యాకింగ్ నుంచి వెనక్కి వెళ్లిపోతుంది. హ్యాకింగ్ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా ప్రస్తుతం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో రోత పత్రిక వక్ర బుద్ది, తప్పుడు పనుల ఆధారాలను పట్టుకోవడం అంత కష్టమేమి కాదు.
ఇది కూడా చదవండి:
Notices: రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు
అంతా దొంగ బుద్ధి
గత కొన్నేళ్లుగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై సాక్షి పథకం ప్రకారం కుట్రలు పన్నిన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రజాదరణ కలిగిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ట్రాఫిక్‌ను తనవైపు మళ్లించుకునేందుకు కుట్ర పన్నిన సాక్షి, ఏబీఎన్ డీఎస్ఎన్జీ ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఫీడ్‌ను దొంగతనం చేసిన విషయం తెలిసిందే. సాక్షి పాడుబుద్ధిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి గమనించి రోత పత్రిక, ఛానల్ దొంగ బుద్ధిని బయటపెట్టింది. అంతేకాదు సాక్షిపై సైబర్ క్రైమ్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతిష్ఠను దెబ్బతీసేలా గత ఐదేళ్లూ ఎన్నో కుట్రలకు పాల్పడిన సాక్షి ప్రస్తుతం తన దొంగ పనులను వదిలివెళ్లిపోతుంది.
ఇది కూడా చదవండి
Balineni: జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు