Share News

Telangana: బోనాలకు హాజరయ్యే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు..

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:42 AM

రేపు, ఎల్లుండి (శని, ఆది) జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

Telangana: బోనాలకు హాజరయ్యే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు..
Bonala Jatara

రేపు, ఎల్లుండి (శని, ఆది) జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలని ఆమె సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికోరారు. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో శాంతి కుమారి సమావేశం నిర్వహించి, ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయానికి భక్తులు వచ్చి, వెళ్ళే మార్గాల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశామని అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ అంక్షలు విధించి, ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు. బోనాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్ధం మహంకాళి పోలీస్‌ స్టేషన్‌లో 20వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు.

KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..


ప్రత్యేక వైద్య బృందాలు..

భక్తులకు వైద్యం అందించేందుకు ఐదు వైద్య బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు మూడు షిఫ్టుల్లో 150 మంది పారిశుధ్య కార్మికులను నియమించామని, ఆలయ పరిసరాల్లో మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశామని హైదరాబాద్ మహానగర పాలకసంస్థ అధికారులు తెలిపారు. పండుగ సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు రెండు 500 కెవి ట్రాన్స్‌ ఫార్మర్లు, డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచామన్నారు.

TGPSC: డిసెంబరుకు గ్రూప్‌-2 వాయిదా..


ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్ నగరంలోని 24 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడపనుంది. ఎంజీబీఎస్, కాచిగూడ రైల్వేస్టేష‌న్, జేబీఎస్, చార్మినార్, బాలాజీ న‌గ‌ర్, నాంప‌ల్లి, రిసాల బ‌జార్, వెంక‌టాపురం, ఓల్డ్ అల్వాల్, మెహిదీప‌ట్నం, కుషాయిగూడ‌, చ‌ర్ల‌పల్లి, హ‌కీంపేట్, ఓల్డ్ బోయిన్‌ప‌ల్లి, చార్మినార్, రాజేందర్‌నగర్, సైనిక్‌పురి, స‌న‌త్‌న‌గ‌ర్, జామై ఉస్మానియా, జీడిమెట్ల‌, జ‌గద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బోరబండ‌, ప‌టాన్‌చెరు తదితర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. బోనాలకు వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ కోరింది. ఈనెల 21, 22న ఈ సేవలు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 9959226147, 9959226143, 9959226130 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

KTR: సర్కారు మార్గదర్శకాలే మాఫీకి మరణ శాసనాలు..


ట్రాఫిక్ ఆంక్షలు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్లాట్‌ఫారమ్ నెంబర్ ఒకటి నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని.. దీంతో ప్రయాణికులు చిలకలగూడ వైపు నుండి ప్లాట్‌ఫారమ్ నెం.10 నుంచి ప్రవేశాన్ని ఉపయోగించాలని పోలీసులు అభ్యర్థించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని తెలిపారు. పొగాకు బజార్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి, బాటా X రోడ్డు నుండి రాంగోపాల్‌పేట PS వరకు సుబాష్ రోడ్డులో రాకపోకలను దారి మళ్లించినట్లు పోలీసుల తెలిపారు.


TGPSC: ‘చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారి’ పరీక్షలు రద్దు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 20 , 2024 | 08:49 AM