Share News

New Virus: హైదరాబాద్‌లో ఉంటున్నారా.. కొత్త వైరస్ వచ్చేసింది.. ఈ లక్షణాలుంటే వెరీ డేంజర్..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 01:12 PM

రోజుకో కొత్త రకం వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఉన్నట్లుంది మనిషిలో ఎన్నో మార్పులు.. సాధారణ పరీక్షలకు దొరకడం లేదు. ఏమిటో తెలుసుకునేలోపు మనలో దూరిన వైరస్ ప్రాణంతకంగా మారుతోంది.

New Virus: హైదరాబాద్‌లో ఉంటున్నారా.. కొత్త వైరస్ వచ్చేసింది.. ఈ లక్షణాలుంటే వెరీ డేంజర్..!
Noro Virus

రోజుకో కొత్త రకం వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఉన్నట్లుంది మనిషిలో ఎన్నో మార్పులు.. సాధారణ పరీక్షలకు దొరకడం లేదు. ఏమిటో తెలుసుకునేలోపు మనలో దూరిన వైరస్ ప్రాణంతకంగా మారుతోంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అదే నోరో వైరస్.. ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువుగా నమోదవుతున్నాయి. అసలు నోరో వైరస్ అంటే ఏంటి.. లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. హైదరాబాద్‌లోనే నోరా వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. గత వారం రోజుల వ్యవధిలో పాతబస్తీ ప్రాంతంలో సుమారు వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త వైరస్‌ను అంటువ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. నోరో వైరస్‌ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. వానాకాలంలో ఈ వైరస్ సోకుతుంది. ప్రధానంగా అశుభ్రత వలన ఈవైరస్ అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?


వైరస్ లక్షణాలు..

నోరో వైరస్ లక్షణాలు నోరో వైరస్ సోకిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడతారు. ఇది ఒక రకమైన అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన పరిసరాల వల్ల ఈవైరస్ సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో చాలామంది రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటారు. నోరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైద్యులు సూచించిన మాత్రలు వాడటం ద్వారా రెండు నుంచి మూడు రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు.

BRS: ఇప్పటి వరకు ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు: హరీష్ రావు


జాగ్రత్తలు..

నోరో వైరస్ సంక్రమించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను తరుచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోడంతో పాటు వైరస్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను ఎక్కువ వేడి ఉండే నీటితో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తికి తగ్గేవరకు దూరంగా ఉండటం మంచిది. హైదరాబాద్ పాతబస్తీలో నోరో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వైరస్ మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్‌లు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న బాలికలలో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ను కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. విరేచనాలు, వాంతులు, శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవ్వడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువుగా ఈ వైరస్ బారినపడే అవకాశాలున్నాయి.

BRS MLAs: చెరో 8 సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకురాలేదు


మొదటగా..

మొదటి నోరోవైరస్ 1968లో USAలోని ఒహియోలోని నార్వాక్‌లో ఒక పాఠశాలలో వ్యాప్తి చెందింది. ఈ కారణంగా నోరోవైరస్ యొక్క మొదటి జాతిని నార్వాక్ వైరస్ అని పిలుస్తారు. నోరోవైరస్ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమవుతుంది. నోరోవైరస్‌లో అనేక రకాలున్నాయి. ఈ వైరస్‌లో 48 రకాలతో 10 సమూహాలు ఉన్నాయి. నోరోవైరస్ ఎంతో సాధారణమైనది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం సుమారు 685 మిలియన్ కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంచనా వేశారు.


TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 24 , 2024 | 01:12 PM