Share News

TDP: జగన్ ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలి: కనకమేడల

ABN , Publish Date - May 02 , 2024 | 01:20 PM

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలని, న్యాయ ప్రక్రియ అడ్డుకోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంధ్రకుమార్ అన్నారు.

TDP: జగన్ ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలి: కనకమేడల

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో (Adopted son) చెప్పాలని, న్యాయ ప్రక్రియ (Judicial process) అడ్డుకోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత (TDP), మాజీ ఎంపీ కనకమేడల రవీంధ్రకుమార్ (Kanakamedala Ravindra Ravindrakumar) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియా (Media)తో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) సీఎంగా ఉన్నప్పుడు అఫిడవిట్‌లో ప్రకటించింది రూ. 18 లక్షల నగదు, 22 ఎకరాల భూమి, బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం అన్ని కలిపి మొత్తం ఆస్తి రూ. 2 కోట్లు మాత్రమేనని అన్నారు.


జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్‌లో బెంగుళూరు ప్యాలెస్, హైదరాబాద్‌లోని 40 బెడ్ రూమ్‌ల ఇల్లు, సాక్షి ఆఫీస్ చూపెట్టలేదని కనకమేడల రవీంధ్రకుమార్ అన్నారు. బినామీ ఆస్తులు, ఇంకా బహిరంగంగా ఉన్న ఇళ్లులు చూపెట్టలేదని ఆరోపించారు. తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ రూ. 43 వేల కోట్ల అవినీతి చేస్తే, ఈ ఐదు ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ ఇంకా ఎన్ని రెట్లు సంపదించారోనని ఆయన అన్నారు. జగన్ దృష్ఠిలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడని కనకమేడల రవీంధ్రకుమార్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్

జగన్ మేనిఫెస్టో డొల్ల: జయ నాగేశ్వర్ రెడ్డి

వైసీపీని పాతాళంలో కలపాలి: సత్యప్రసాద్

కూటమిదే విజయం: గంటా శ్రీనివాసరావు

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 02 , 2024 | 01:25 PM