Share News

Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్.. కేటాయింపుల వివరాలివే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:02 PM

Telangana Budget 2024-25: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం,

Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్.. కేటాయింపుల వివరాలివే..
Telangana Budget 2024

Telangana Budget 2024-25: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం వంటి వివరాలను వెల్లడించారు. అలాగే, బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారు.. ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలను బడ్జెట్ ప్రసంగంలో వివరించారు ఆర్థిక మంత్రి భట్టి.


తెలంగాణ బడ్జెట్ 2024-25 పూర్తి వివరాలివే..

  • తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ : రూ.2,91,191 కోట్లు.

  • రెవెన్యూ వ్యయం - రూ.2,20,945 కోట్లు

  • మూలధన వ్యయం - రూ.33,487 కోట్లు

  • తెలంగాణ తలసరి ఆదాయం - రూ.3,47,299

  • తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు - రూ. 75,577 కోట్లు.

  • ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పు - రూ. 6.71 లక్షల కోట్లు

  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు.


వివిధ రంగాలకు కేటాయింపులు కోట్లలో..

  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ. 72,659

  • హార్టికల్చర్ - రూ. 737

  • పశుసంవర్ధక శాఖ - రూ. 19,080

  • మహాలక్ష్మి ఉచిర రవాణా - రూ. 723

  • గృహజ్యోతి - రూ. 2,418

  • ప్రజాపంపిణీ వ్యవస్థ - రూ. 3,836

  • పంచాయతీ రాజ్ - రూ. 29,816

  • మహిళా శక్తి క్యాంటిన్ - రూ. 50

  • హైదరాబాద్ అభివృద్ధి- రూ. 10,000

  • జీహెచ్ఎంసీ - రూ. 3,000

  • హెచ్‌ఎండీఏ - రూ. 500

  • మెట్రో వాటర్ - రూ. 3,385

  • హైడ్రా - రూ. 200

  • ఏయిర్పోట్‌కు మెట్రో - రూ. 100

  • ఓఆర్ఆర్ - రూ. 200


  • హైదరాబాద్ మెట్రో - రూ. 500

  • ఓల్డ్ సిటీ మెట్రో - రూ. 500

  • మూసీ అభివృద్ధి - రూ. 1,500

  • రీజినల్ రింగ్ రోడ్డు - రూ. 1,500

  • స్ర్తీ, శిశు సంక్షేమం - రూ. 2,736

  • ఎస్సీ, ఎస్టీ సంక్షేమం - రూ. 17,000

  • మైనారిటీ సంక్షేమం - రూ. 3,000

  • బీసీ సంక్షేమం - రూ. 9,200

  • వైద్య ఆరోగ్యం - రూ. 11,468

  • విద్యుత్ - రూ. 16,410

  • అడవులు, పర్యావరణం - రూ. 1,064

  • ఐటి - రూ. 774

  • నీటి పారుదల - రూ. 22,301

  • విద్య - రూ. 21,292

  • హోంశాఖ - రూ. 9,564

  • ఆర్‌ అండ్‌ బి - రూ. 5,790


Also Read:

అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్...

మొదలైన రాజీనామాలు..

జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ రియాక్షన్..

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 25 , 2024 | 01:12 PM