Share News

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

ABN , Publish Date - Aug 20 , 2024 | 05:43 PM

Congress vs BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!
Jaggareddy

హైదరాబాద్, ఆగష్టు 20: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే తామేమైనా ఖాళీగా కూర్చున్నామా కేటీఆర్? అంటూ కన్నెర్ర జేశారు. తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకుంటే చెప్పుతో కొడతామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ లాంటి గొప్ప నాయకుని గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీలకు సరైన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్లు నరకం చూపించింది కాబట్టే.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారన్నారు.


తాగినోడిలా మాటలు..

‘మా ధైర్యం, మా సాహసాల మీద నువ్వెంత. మీరు చాకులు తెస్తే.. మేము చాకులు తెస్తాం. కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినోడి లాగా మాట్లాడుతుండు మీ అయ్య కేసీఆర్ చారాణ చేస్తే, నువ్వు బారాణ చెప్తావు. మేము సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి గులాం గిరి చేస్తాం నిజమే.’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఐదు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసే దమ్ము, ధైర్యం మీకు లేదంటూ కేటీఆర్‌కు చురకలంటించారు. అయినా మీరు విగ్రహం తీసేయాలంటే అధికారంలోకి రావాలని.. కానీ ప్రజలు ఆ అవకాశం మీకు ఇవ్వరని కేటీఆర్‌కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మరో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని తమకు ప్రజలు అవకాశం ఇచ్చారని.. తమ పాలన చూసి మరో ఐదేళ్లు కూడా అవకాశం ఇస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని.. తాము రానివ్వబోమని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పని చేస్తామన్నారు.


అది గులాంగిరి కాదా?

యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశాడని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ ఇంటికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ నేత.. మీరు చేసింది గులాం గిరి కాదా? అని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం మీ కుటుంబం మొత్తం ఢిల్లీకి పోయినప్పుడు సోనియా గాంధీకి గులాం గిరి చేసినట్లు అనిపించలేదా? అని నిలదీశారు. దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీ బలిదానం కావడం నిజమా? కాదా? అని ప్రశ్నించారు. 18 సవత్సరాలు ఉన్న ప్రతి యువతి, యువతులకు రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించారని.. రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజితో చదువుకొని కేటీఆర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అలాంటి మహనీయుడికి ధన్యవాదాలు తెలిపే గుణగణాలు కూడా లేవని కేటీఆర్‌పై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.


ట్రైనింగ్ తీసుకోవాల్సింది..

కేటీఆర్‌కు ఇంకా మాట్లాడటం రావడం లేదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటే మంచిదన్నారు. కేటీఆర్‌కు ఎలాంటి ఇష్యూ మీద మాట్లాడాలో తెలియడం లేదని విమర్శించారు. కేటీఆర్ మాత్రమే కాకుండా.. కేటీఆర్‌కు కూడా కోచింగ్ ఇప్పించడం ఉత్తమం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జర్నలిస్టుల సమస్యలను సైతం ప్రస్తావించారు జగ్గారెడ్డి. పదేళ్ల కాలంలో జర్నలిస్టుల సమస్యల కోసం, ప్లాట్ల కోసం ఏనాడైనా అల్లం నారాయణ పోరాటం చేశాడా? అని ప్రశ్నించారు. అల్లం నారాయణ మేధావి అనడం పెద్ద జోక్ అని.. ఆయన ఒక జోకర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.


Also Read:

సీఎం పదవిపై ఓపెన్ అయిన డీకే..!

సీఎం రేవంత్, పవన్  కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కావాలి!

ఎల్లుండి ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2024 | 05:43 PM