Share News

Thummala: పాత డేటా ప్రకారమే రుణమాఫీ.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:05 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లక్ష రూపాయల రుణమాఫీని ఎల్లుండి నుంచి చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు.

Thummala: పాత డేటా ప్రకారమే రుణమాఫీ.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
Minister Thummala Nageswara Rao

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లక్ష రూపాయల రుణమాఫీని ఎల్లుండి నుంచి చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామని వివరించారు. ముందుగా రూ.1 లక్ష వారం ర్వాత మిగతా లక్ష రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చేయబోతోందని తెలిపారు. గతంలో డేటా సరిగా లేనందున ఈసారి రేషన్ కార్డు ప్రామాణికంగా రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. రుణమాఫీకి రేషన్ కార్డును కుటుంబ వివరాల కోసం మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. రుణమాఫీ పాత పద్ధతిలోనే మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో నాలుగు విడతలుగా రుణమాఫీ జరిగిందని చెప్పారు.


‘‘ఎన్నికల చివర్లో రూ.25 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా రూ.13 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది.. అప్పుడు మిగిలిపోయిన వారికి ఇప్పుడు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. పాత డేటా ప్రకారమే రుణమాఫీ ఉంటుంది. 60 లక్షల్లో దాదాపు ఆరు లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు ఉండదు. బీఆర్ఎస్ హయాంలో సగం మాత్రమే రుణమాఫీ జరిగింది.మిగిలిపోయిన సగానికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. అందులో మొదటిసారి రూ.లక్ష చేస్తున్నాం. కాబట్టి లేనిపోని చిల్లర మల్లర మాటలు మాట్లాడి బీఆర్ఎస్, బీజేపీ నేతలు అబాసు పాలు కావొద్దు. ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం పూర్తి అవుతుంది. రైతులకు విజ్ఞప్తి ఏమనగా తెల్ల రేషన్ కార్డ్ అనేది నిర్ధారణ కోసం మాత్రమే. అన్ని బ్యాంకుల వివరాలు మా దగ్గర ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి దగ్గరకు నేరుగా మా డిపార్ట్మెంట్ వెళ్లి పరిశీలిస్తుంది. 18 తేదీన 12 లక్షల మంది రైతులకు లక్ష రుణమాఫీ ఉంటుంది. లక్ష రూపాయల జీతం ఉన్న వాళ్లకు రుణమాఫీ కాదు. ఇలా వాళ్ళు 17వేల అకౌంట్స్ ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి. నకిలీ పట్టా పాసు బుక్‌లు పెట్టి రుణాలు తీసుకున్న వారిని ఐడెంటిఫై చేశాం. 18 తేదీన దాదాపు రూ.6 వేల కోట్లు రైతుల ఖాతాలోకి వెళ్తున్నాయి’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 09:09 PM