Share News

N Convention: N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 25 , 2024 | 07:51 PM

ఎన్.. కన్వెన్షన్ నేలమట్టం.. గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ! టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందినది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను ఝులిపించిన సంగతి తెలిసిందే...

N Convention: N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కీలక ప్రకటన
N Convention Demolition

హైదరాబాద్: ఎన్.. కన్వెన్షన్ (N Convention) నేలమట్టం.. గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ! టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందినది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను (HYDRAA) ఝులిపించిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయాన్నే హైడ్రా టీమ్ కూల్చివేతలు ప్రారంభించగా.. దాదాపు అంతా అయిపోయే సమయానికి రాష్ట్ర హైకోర్టు నుంచి నాగార్జున ‘స్టే’ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో నాగ్‌కు బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయ్యింది. అయితే.. ఎన్ కన్వెన్షన్‌పై కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేక కథనాలు మాత్రం ఆగలేదు. అసలేంటీ ఎన్ కన్వెన్షన్..? పుట్టు పూర్వోత్తరాలు ఏంటి..? వివాదం ఏంటి..? అక్కినేని వారి ఆక్రమణలు ఇలా చిత్ర విచిత్రాలుగా కథనాలు వస్తున్నాయి. హీరో అయ్యుండి విలన్‌గా మారి ఆక్రమణలు చేయడమేంటి..? అని నెట్టింట్లో పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరికి తోచినట్లు వాళ్లు రాసేస్తుండటంతో ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించి ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. అక్కినేని అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తూ నాగ్ పలు ఆసక్తికర విషయాలను రాసుకొచ్చారు.


N-Convention-Hall.jpg

ఎవరూ నమ్మకండి..!

ప్రియమైన అందరికీ..

అభిమానులు, శ్రేయోభిలాషులు..

సెలబ్రిటీల గురించిన వార్తలు, ప్రభావం కోసం తరచుగా అతిశయోక్తి మరియు ఊహాగానాలు చేయవచ్చు. ఎన్-కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. అంతకు మించి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణకు గురికాలేదు. తుమ్మిడికుంట సరస్సులో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని 24-02-2014న ఏపీ భూసేకరణ (నిషేధం) చట్టం యొక్క ప్రత్యేక న్యాయస్థానం Sr.3943/2011 ఉత్తర్వును జారీ చేస్తూ తీర్పునిచ్చింది. ఇప్పుడు అధికారిక వాదన ఇప్పటికే గౌరవనీయమైన హైకోర్టు ముందు సమర్పించబడింది. నేను భూమి యొక్క చట్టానికి, తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, వాస్తవాలను తప్పుగా చూపించడం, ఫిరాయింపులకు గురికావద్దని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానుఅని అభిమానులకు అక్కినేని నాగార్జున విజ్ఞప్తి చేస్తూనే.. మరోవైపు ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.


ఇదీ ‘ఎన్’ ప్రత్యేకత!

పార్టీలు, పెళ్లిళ్లు, ఫ్యాషన్‌ షోలు, బోర్డు మీటింగ్‌లు, ఎగ్జిబిషన్‌లు..! హైదరాబాద్‌లో కాస్త ఉన్నత స్థాయి వేడుక ఏదైనా వేదికగా మొదట ‘ఎన్‌’ కన్వెన్షన్‌కే ప్రాధాన్యం. నటుడు అక్కినేని నాగార్జున తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి నల్లా ప్రీతమ్‌రెడ్డితో కలిసి 14 ఏళ్ల కిందట ఎన్‌3 ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట దీనిని నిర్మించారు. ‘సందర్భం ఏదైనా వేదిక మాది..’ అనే ట్యాగ్‌లైన్‌తో మరెక్కడా జరగనన్ని వేడుకలకు ఇది వేదిక అయింది. ఇప్పుడు హైడ్రా దెబ్బకు కాలగర్భంలో కలిసింది. ఎన్‌లో నాలుగు హాళ్లు ఉండగా.. 27 వేల చ.అ. విస్తీర్ణంలో 3 వేలమంది కూర్చునే ప్రధాన హాల్‌లో ఖరీదైన వివాహాలు, రిసెప్షన్లతో పాటు ఫ్యాషన్‌ షోలు, సినిమా వేడుకలు జరిగేవి. దీనిని ఆనుకుని 37 వేల చ.అ. విస్తీర్ణంలోని భారీ గార్డెన్‌లో పెళ్లిళ్లు లేదంటే భారీ ఫంక్షన్స్‌, అంతర్జాతీయ సంస్థల ప్రమోషన్స్‌ నిర్వహించేవారు. 5 వేల చ.అ.లలోని డైమండ్‌ హాల్‌లో 500 మందితో చిన్న వేడుకలు, కంపెనీల ఉత్పత్తుల ఆవిష్కరణలు జరిగేవి. దీని బయట మర్రి చెట్టు చెంత బనియాన్‌ అంటూ ఓపెన్‌ ఎయిర్‌ వెన్యూ 26 వేల చ.అ.లలో ఉంది. ఈ రెండింటి అవసరాలను తీర్చుతూ ఏడు వేల చ.అ.లలో అనెక్స్‌ హాల్‌ను నిర్మించారు.

Updated Date - Aug 25 , 2024 | 08:08 PM