Share News

TS News: అందమైన వాయిస్‌తో వలపు వల... కలుద్దామని పిలిచి నిలువు దోపిడి..

ABN , Publish Date - May 12 , 2024 | 09:28 AM

అందమైన వాయిస్‌తో వలపు వల వేసి... కలుద్దామని పిలిపించి ఓ యువతి నిలువు దోపిడీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిలాడీ లేడీని ఎరగా వేసి యువకుడిని ఓ ముఠా బెదిరిస్తోంది. పోలీసులకు.. మీడియాకు పట్టిస్తమంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంది. కారులో తీసుకుని వెళ్లి పెట్రోల్ బంకులో స్కాన్ చేయించి సదరు ముఠా డబ్బులు దోచుకుంది.

TS News: అందమైన వాయిస్‌తో వలపు వల... కలుద్దామని పిలిచి నిలువు దోపిడి..

హాయ్ అంటూ వినిపించిన స్వీట్ వాయిస్‌తో ఓ యువకుడు ఫిదా అయిపోయాడు. అలా మొదలైన మాటలు ఎక్కడికో వెళ్లిపోయాయి. హద్దులు దాటాయి. అమ్మాయి అందమైన గొంతు విని అంతే అందంగా ఉంటుందని ఊహించుకున్నాడు. ఒక్క ఫోనుతో అందాల రాశి తన జీవితంలోకి వచ్చేసిందని భావించాడు. కలుద్దామంటే దువ్విన తలనే దువ్వి... అద్దిన పౌడర్ అద్ది మరీ రెక్కలు కట్టుకుని సదరు యువతి రమ్మన్న ప్లేస్‌లో వాలిపోయాడు. ఇక అక్కడికి వెళ్లాక కానీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవలేదు.

Hyderabad: పింఛను దానం కాదు.. హక్కు ..


హైదరాబాద్: అందమైన వాయిస్‌తో వలపు వల వేసి... కలుద్దామని పిలిపించి ఓ యువతి నిలువు దోపిడీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిలాడీ లేడీని ఎరగా వేసి యువకుడిని ఓ ముఠా బెదిరిస్తోంది. పోలీసులకు.. మీడియాకు పట్టిస్తమంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంది. కారులో తీసుకుని వెళ్లి పెట్రోల్ బంకులో స్కాన్ చేయించి సదరు ముఠా డబ్బులు దోచుకుంది. డేటింగ్ యాప్ ద్వారా కేటుగాళ్లు యువకుడికి గాలం వేశారు. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ipc 382, 120(బీ) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.

ఇవి కూడా చదవండి..

AP Elections 2024: మైకులు బంద్.. ప్రలోభాలు స్టార్ట్

Karunakar Reddy: ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 09:56 AM