Share News

JNTU: పార్ట్‌టైమ్‌ బీటెక్‌కు జేఎన్‌టీయూ పచ్చజెండా..

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:08 AM

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం పార్ట్‌టైమ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ల నిర్వహణకు జేఎన్‌టీయూ పచ్చజెండా ఊపింది. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌ తమ ఉద్యోగాలు చేస్తూనే బీటెక్‌ కోర్సులను అభ్యసించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గం సుగమం చేసింది.

JNTU: పార్ట్‌టైమ్‌ బీటెక్‌కు జేఎన్‌టీయూ పచ్చజెండా..

  • వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు

  • మూడు కోర్సుల్లో 90 సీట్లకు అనుమతి

5.jpg

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం పార్ట్‌టైమ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌ల నిర్వహణకు జేఎన్‌టీయూ పచ్చజెండా ఊపింది. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ప్రొఫెషనల్స్‌ తమ ఉద్యోగాలు చేస్తూనే బీటెక్‌ కోర్సులను అభ్యసించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మార్గం సుగమం చేసింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌తోపాటు మెకానికల్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో పార్ట్‌టైమ్‌ బీటెక్‌ ప్రవేశాల నిమిత్తం యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రిన్సిపాల్‌ ప్రతిపాదనలు పంపగా జేఎన్‌టీయూ వీసీ బుర్రా వెంకటేశం ఆమోదం తెలిపారు. ప్రిన్సిపాల్


దీంతో ఈ విద్యా సంవత్సరం(2024-25)నుంచే జేఎన్‌టీయూలో పార్ట్‌టైమ్‌ బీటెక్‌ ప్రవేశాలకు అనుమతిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా కోర్సులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో గరిష్ఠంగా 30 సీట్ల చొప్పున అనుమతించడంతో మొత్తం మూడు కోర్సుల్లో 90 మంది డిప్లొమా హోల్డర్లు నేరుగా బీటెక్‌ సెకండియర్‌లో అడ్మిషన్‌ తీసుకునే అవకాశం ఏర్పడుతోంది.


పార్ట్‌టైమ్‌ బీటెక్‌లో ప్రవేశం కోసం వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కనీసం ఏడాది పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌, ఒకేషనల్‌ కోర్సులతోపాటు మూడేళ్ల బీఎస్సీ కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు. కనీసం 45శాతం మార్కులతో ఆయా కోర్సులను పూర్తి చేసి ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా రెగ్యులర్‌ బీటెక్‌ మాదిరిగానే పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కూడా పూర్తి చేసుకోవచ్చు.


బ్లెండెడ్‌ విధానంలో బోధన

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు బీటెక్‌ ప్రోగ్రామ్‌లను పార్ట్‌టైమ్‌ మాదిరిగా కాకుండా బ్లెండెడ్‌ విధానంలో నిర్వహించాలని యోచిస్తున్నాం. ఆచార్యులకు, ప్రొఫెషనల్స్‌కు అనువైన సమయాల్లో ఆయా కోర్సుల బోధన ఉండేలా ప్రణాళిక చేస్తున్నాం. ఏఐసీటీఈ అనుమతి మేరకు 60 శాతం సిలబ్‌సను ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ క్లాస్‌వర్క్‌ ద్వారా, 40శాతం సిలబ్‌సను మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ (మూక్స్‌)లతో పూర్తిచేయవచ్చు.

- జి.వి.నర్సింహారెడ్డి, జేఎన్‌టీయూ కాలేజీ

Updated Date - Jun 21 , 2024 | 03:08 AM