Share News

TS NEWS: సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావు పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Feb 19 , 2024 | 08:42 PM

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణను వాయిదా వేసింది. గత ఏడాది వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వనమా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

TS NEWS: సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఢిల్లీ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణను వాయిదా వేసింది. గత ఏడాది వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వనమా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదవీకాలం ముగిశాయని, కొత్తగా ఎన్నికలు కూడా జరిగాయని కోర్టు దృష్టికి వనమా తరపు న్యాయవాది తీసుకెళ్లారు.

వనమా తరపు న్యాయవాది వాదనలపై జలగం వెంకట్రావు తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పదవీకాలం ముగిసినప్పటికీ ఆరేళ్లు అనర్హత వేటు వేయాల్సిన నిబంధనలు ఉన్నాయని దాని ప్రకారం వనమా వెంకటేశ్వర రావుపై చర్యలు తీసుకోవాలని జలగం తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అనర్హత అంశాన్ని ప్రస్తావించారని ధర్మాసనం పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కేసును నాన్ మిస్ లీనియస్ రోజున వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 08:59 PM