Minister Thummala: తెలంగాణను ఆయిల్ పామ్ హబ్‌గా మారుస్తాం
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:18 PM
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు 31 జిల్లాల్లో అనుమతులు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ ఫెడ్‌తో పాటు 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం: మలేషియా పర్యటనపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. మలేషియాలో ఆయిల్ పామ్ సాగు సాంకేతిక పద్ధతులు ప్రాసెసింగ్ ప్లాంట్స్...రిఫైనరీ ప్లాంట్స్ పరిశీలించినట్లు వివరించారు. మలేషియా ఆయిల్ పామ్, వ్యవసాయ శాఖ మంత్రులను కలిశామని అన్నారు. ఇవాళ( భద్రాద్రి కొత్తగూడెం) జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ....తెలంగాణ మలేషియా మధ్య వ్యాపార వాణిజ్య అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు.
ఆయిల్ పామ్ సాగుకు 31 జిల్లాల్లో అనుమతులు ...
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు 31 జిల్లాల్లో అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఆయిల్ ఫెడ్‌తో పాటు 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తక్కువ ఎత్తు కురచ ఆకు ఎక్కువ దిగుబడులు ఇచ్చే ఆయిల్ పామ్ మొక్కల రకాల కోసం మలేషియాలో వెతికామని అన్నారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటలుగా కోకో, వక్క, జాజికాయ, మిరియం సాగు చేయొచ్చని తెలిపారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటలకు సబ్సిడీ ఇస్తామని అన్నారు. భారతదేశం ప్రతి ఏడాది లక్ష కోట్లు పైగా విలువైన వంట నూనెలు దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే దిగుమతులు అవసరం లేదని అన్నారు. మలేషియాలో ఆయిల్ పామ్ సాగులో తెలుసుకున్న అంశాలు ఇక్కడ రైతులకు వివరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
దిగుమతి సుంకం పెంపుతో...
మరోవైపు.. దిగుమతి సుంకం పెంపుతో పామాయిల్ పండించే రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.14,392గా ఉండగా.. అది టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉందని, వెరసి మొత్తంగా ఒక్కో ఆయిల్ పామ్ గెల ధర రూ.16,500గా పెరిగే అవకాశం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
పామాయిల్ సాగు విరివిగా చేపట్టాలి..
తెలంగాణలో ప్రస్తుతం 44,400 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుంచి 2.80 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలలు దిగుబడి వస్తుందని తుమ్మల తెలిపారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణలో పామాయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని వివరించారు. రైతులు పామాయిల్ సాగు విరివిగా చేపట్టాలని తుమ్మల పిలుపునిచ్చారు. కాగా ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గడంతో రైతుల్లో నిరాశ నెలకొందని, ఈ పంట సాగు చేయాలనుకున్నవారిపై ప్రతికూల ప్రభావం చూపిందని అన్నారు.
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు అధిక ధరలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, దిగుమతి చేసుకుంటున్న ముడి పామాయిల్‌పై సుంకాన్ని పెంచాలని ఆ లేఖలో కోరారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌తోనూ తుమ్మల ప్రత్యేకంగా మాట్లాడారు. స్పందించిన కేంద్రం తాజాగా సుంకాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: ఫాంహౌస్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర.. హరీష్‌రావు ధ్వజం
Raj Pakala: పోలీసుల నోటీసులపై రాజ్‌పాకాల స్పందన
Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి
TG News: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్
Read Latest Telangana News And Telugu News