Share News

Maoist Murder: రాధా అలియాస్ నీల్సోను హతమార్చిన మావోయిస్టులు..

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:33 PM

చర్ల( ​Charla) మండలం చెన్నాపురం(Chennapuram) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు కోవర్టుగా మారిందనే సమాచారంతో తోటి మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు.

Maoist Murder: రాధా అలియాస్ నీల్సోను హతమార్చిన మావోయిస్టులు..

భద్రాద్రి కొత్తగూడెం: చర్ల(Charla) మండలం చెన్నాపురం(Chennapuram) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు కోవర్టుగా మారిందనే సమాచారంతో తోటి మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు. హైదరాబాద్ బాలాజీ నగర్‌కు చెందిన రాధా(Radha) అలియాస్ నీల్సో ఆరేళ్ల కిందట పార్టీలో చేరిందని, అయితే గత కొన్ని రోజులుగా తమ సమాచారాన్ని ఆమె పోలీసులకు చేరవేస్తున్నట్లు మావోలు తెలిపారు. ఈ మేరకు ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్​ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరుతో లేఖను విడుదల చేశారు.


మావోయిస్టు లేఖలోని అంశాలు..

2018లో మావోయిస్టు పార్టీలో రాధా చేరిందని, అయితే పోలీసుల బెదిరింపులకు లొంగి ఇన్​ఫార్మర్‌గా మారినట్లు లేఖలో పేర్కొన్నారు. తమతో ఆరేళ్లుగా ఉంటున్న రాధా, ఆమె సోదరుడు సూర్యం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తెలిపారు. వారిద్దరూ పోలీస్ ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నీల్సోపై అనుమానం రావడంతో మూడు నెలల కిందట ఆమెను కమాండర్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.


తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రాధా ద్వారా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు తెలుసుకున్నారని చెప్పారు. ఈ కారణాలతో రాధా అలియాస్ నీల్సోకు పార్టీ మరణశిక్ష విధించినట్లు వెల్లడించారు. శిల్పా, దేవేంద్ర అనే వ్యక్తులు రాధాను మావోయిస్టు పార్టీ వైపు మళ్లించారు. గతంలో శిల్పా కేసు విషయంలో ఏపీ, తెలంగాణలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలువురిని అరెస్టు చేశారు.

Updated Date - Sep 03 , 2024 | 01:51 PM