Share News

KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:28 AM

మేడిగడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు, సోషల్ మీడియా చేసిన దుష్ర్పభావాలు పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు.

KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..

హైదరాబాద్: మేడిగడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు, సోషల్ మీడియా చేసిన దుష్ర్పభావాలు పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు. గోదావరిలో వస్తున్న వరదతో మేడిగడ్డ బ్యారేజీ నిండుకుండలా మారడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ తన ఎక్స్ అకౌంట్‌లో ఇలా రాసుకొచ్చింది. "కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ళ కుల్లును, కుతంత్రాలును కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోంది.


తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం" అని బీఆర్ఎస్ అందులో పేర్కొంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అందుకే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు పగుళ్లు ఏర్పడ్డాయని అధికార కాంగ్రెస్ ఎన్నాళ్ల నుంచో విమర్శిస్తూ వస్తోంది. అంతే ధీటుగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పి కొడుతోంది.


త్వరలో కేటీఆర్ పర్యటన

కాగా మేడిగడ్డ నిండుకుండను తలపిస్తుండంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిజం ఎన్నడూ దాగదని, కాంగ్రెస్ కుట్రలో బయటపడ్డాయని ఆయన విమర్శించారు. త్వరలోనే మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

గోదావరి ఉరకలు..

గోదావరిలో కాళేశ్వరం ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ దిగువన నది ఉరకలు వేస్తోంది. మేడిగడ్డ వద్ద 3.41 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన సమ్మక్క సాగర్‌ వద్ద 3.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది.

Updated Date - Jul 20 , 2024 | 08:52 AM