Share News

KTR: కేటీఆర్‌ ఎద్దేవా.. కాంగ్రెస్‏తో పెద్ద మార్పే తెచ్చారుగా..!

ABN , Publish Date - Jul 11 , 2024 | 11:48 AM

కాంగ్రెస్‌ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థల కారణంగా కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Working President KTR) అన్నారు.

KTR: కేటీఆర్‌ ఎద్దేవా.. కాంగ్రెస్‏తో పెద్ద మార్పే తెచ్చారుగా..!

- కలుషిత ఆహారం ఘటన నేపథ్యంలో కేటీఆర్‌ ఎద్దేవా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థల కారణంగా కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Working President KTR) అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని. బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుకలు తిరిగే చట్నీలు దర్శనమిస్తున్నాయని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఆరోపించారు. ‘మార్పుకావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అన్న ప్రచారంతో అధికారంలోకి వచ్చాక ఇటువంటి పెద్దమార్పే తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.

దికూడా చదవండి: Hyderabad: దివ్యాంగుల మేనిఫెస్టోను అమలుచేసి తీరుతాం..


మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతమైందని, నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లిపడి.. 20 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారని తెలిపారు. తాజాగా సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విషాహారం తిన్న విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని కేటీఆర్‌ ప్రశ్నించారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 11:48 AM