Share News

Hyderabad: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్‌..

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:03 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌(ఎక్స్‌) ఖాతాలో పెట్టిన ఓ పోస్టుపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపారు.

Hyderabad: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్‌..

  • బీఆర్‌ఎస్‌ పోస్టుపై అభ్యంతరం తెలిపిన మంత్రి

హైదరాబాద్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక ట్విటర్‌(ఎక్స్‌) ఖాతాలో పెట్టిన ఓ పోస్టుపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపారు. ఇందిరమ్మ రాజ్యం.. ఇసుక గాళ్ల రాజ్యం అంటూ బీఆర్‌ఎస్‌ పెట్టిన ఆ పోస్టుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ అధికారిక ఖాతా కావడంతో బాధ్యుడిగా పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్‌కు నోటీసులు పంపుతున్నట్లు ఆమె వెల్లడించారు.


అలాగే తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా కూడా సోషల్‌ మీడియా వేదికగా విషప్రచారం చేశారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను తక్షణమే కేసీఆర్‌, ఆ పార్టీ తనకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. జూన్‌ 24న బీఆర్‌ఎస్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు కారణంగానే కేసీఆర్‌ తోపాటు ఆ పార్టీకి నోటీసులు పంపామని మంత్రి సీతక్క తరఫు న్యాయవాది వెల్లడించారు.

Updated Date - Jul 06 , 2024 | 03:03 AM