Share News

Mallu Bhatti Vikramarka: నేడు ఒడిసాలో రాహుల్‌తో కలిసి భట్టి ప్రచారం..

ABN , Publish Date - May 30 , 2024 | 04:38 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిసా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్‌ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రలోక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.

Mallu Bhatti Vikramarka: నేడు ఒడిసాలో రాహుల్‌తో కలిసి భట్టి ప్రచారం..

  • సర్కారుపై కేటీఆర్‌ తప్పుడు ప్రచారం: వెడ్మ బొజ్జు

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిసా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్‌ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి భద్రలోక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. వారం రోజుల పాటు పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో భట్టి ప్రచారం సాగించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర గీతంపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.


పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి ముందు ఒడిసా, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు రాహుల్‌, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేల భారీ సభలను సమన్వయం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీచార్జ్‌ చేశారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మండిపడ్డారు. రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఉచితంగా ఎరువులు ఇస్తామని కేసీఆర్‌ రైతులను మోసం చేశారని, అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్‌ఎ్‌సకు లేదని వ్యాఖ్యానించారు. ట్యాపింగ్‌ కేసులో బాధ్యులైన పోలీసు అధికారుల ఆస్తులను జప్తు చేసి.. వారిని సర్వీసు నుంచి తొలగించాలని టీపీసీసీ అధికార ప్రతినిధులు చనగాని దయాకర్‌, రియాజ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో తిరుగుతున్న చెడ్డి గ్యాంగ్‌కు.. భుజంగరావు, ప్రభాకర్‌రావు, ప్రణీత్‌ రావులకు తేడా లేకుండా పోయిందని ఆరోపించారు.

Updated Date - May 30 , 2024 | 04:38 AM