Share News

TS News: ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారంపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 27 , 2024 | 09:46 PM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది.

TS News: ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారంపై మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

వరంగల్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించిన నాటి నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘‘ఆయన రాడు .. వచ్చిన చేర్చుకోబోం. హైప్ కోసం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటే’’ అని కొండా సురేఖా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యాటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇక వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి 1 గంటకు వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకుంటారని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత వరంగల్ అభివృద్ధి, స్మార్ట్ సిటీ పనులపై రివ్యూ నిర్వహిస్తారని చెప్పారు.


వరంగల్ పాత మాస్టర్ ప్లాన్‌ను మార్చాల్సిన అవసరాన్ని, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చి... ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తున్నారని, దశలవారీగా వరంగల్ అభివృద్ధి చేస్తామని కొండా సురేఖ చెప్పారు.

Updated Date - Jun 27 , 2024 | 09:46 PM