Share News

Ponguleti: రుణమాఫీ చేస్తామంటే విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి..

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:39 AM

ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సిద్ధమవడంతో ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని

Ponguleti: రుణమాఫీ చేస్తామంటే విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి..

  • అన్ని హామీలు నెరవేరుస్తాం: మంత్రి పొంగులేటి

నేలకొండపల్లి, జూన్‌ 22: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సిద్ధమవడంతో ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని, సొల్లు కబుర్లు చెబుతూ గగ్గోలు పెడునతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతన్నల ముఖాల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో జూలై నుంచి రుణమాఫీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.


రూ.31వేల కోట్లతో అందరికీ రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. రుణమాఫీ చేయలేమని ప్రతిపక్షం ఎన్నో అవాకులు, చెవాకులు పేలిందని, ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడటం మంచిదన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్‌కార్డు, ఆసరా పెన్షన్‌ ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 03:39 AM