Share News

Central budget response: బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్‌ విమర్శలు: సీతక్క

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:26 AM

కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్‌.. రాష్ట్ర బడ్జెట్‌పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు.

Central budget response: బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్‌ విమర్శలు: సీతక్క

కేంద్ర బడ్జెట్‌పై స్పందించని కేసీఆర్‌.. రాష్ట్ర బడ్జెట్‌పైన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో బుధవారం తీర్మానం ప్రవేశపెడితే దానిపై మాట్లాడేందుకు కేసీఆర్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడని కేసీఆర్‌.. రాష్ట్ర బడ్జెట్‌ను విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెప్పు కోసమే కేసీఆర్‌.. రాష్ట్ర బడ్జెట్‌పైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలలుగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 05:26 AM