Share News

Nirmal: గడువు ముగిసిన మందుల వాడకంపై కలెక్టర్‌ సీరియస్‌

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:06 AM

‘కాలం చెల్లిన సెలైన్‌తో రోగికి చికిత్స’ అనే శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ స్పందించారు.

Nirmal: గడువు ముగిసిన మందుల వాడకంపై కలెక్టర్‌ సీరియస్‌

  • స్టాఫ్‌నర్సుపై సస్పెన్షన్‌ వేటు

  • ఖానాపూర్‌ ప్రభుత్వాస్పత్రి ఫార్మాసిస్ట్‌, స్టాఫ్‌నర్సుపై సస్పెన్షన్‌ వేటు

  • సూపరింటెండెంట్‌ సహా ఐదుగురికి మెమోల జారీ

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ఖానాపూర్‌, ఆగస్టు 10: ‘కాలం చెల్లిన సెలైన్‌తో రోగికి చికిత్స’ అనే శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ స్పందించారు. ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం కడెం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన అజారుద్దీన్‌ అనే వ్యక్తికి కాలం చెల్లిన సెలైన్‌ బాటిల్‌ను ఎక్కించిన ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని సస్పెండ్‌ చేయడంతో పాటు ఐదుగురికి మెమోలను జారీ చేశారు.


ఈ ఘటనకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రాజేందర్‌, డీసీహెచ్‌ఎ్‌స సురేశ్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఆసుపత్రిలో ఫార్మాసి్‌స్టగా విధులు నిర్వహిస్తున్న సునీతను, స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వహిస్తున్న చంద్రకళను సస్పెండ్‌ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వంశీమాధవ్‌, ఫార్మాసిస్టులు శ్రీనివాసాచారి, ఎం. విజయకుమార్‌, వెంకటేశ్‌, కళ్యాణికి మెమోలను జారీ చేశారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - Aug 11 , 2024 | 03:06 AM