Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కుతోనే బెయిల్‌: పొన్నం

ABN , Publish Date - Aug 28 , 2024 | 05:57 AM

బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు కుమ్ముక్కవడం వల్లనే కవితకు బెయిల్‌ సాధ్యపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కుతోనే బెయిల్‌: పొన్నం

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు కుమ్ముక్కవడం వల్లనే కవితకు బెయిల్‌ సాధ్యపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు అధికారంలో ఉన్న గత పదేళ్లు చెట్టాపట్టాలేసుకొని ఉన్నాయన్నారు. అందుకే తాము ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అంటూ వాళ్ల నాటకాల్ని ఎండగట్టామన్నారు. కేంద్రంలోని ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్‌ సహకరించిన విషయాన్ని పొన్నం గుర్తు చేశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు కావడం వల్లనే ఆమెకు బెయిల్‌ లభించిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు కవితకు బెయిల్‌తో బయటపడ్డాయని, ఇక బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కావడం ఒక్కటే మిగిలిందన్నారు. ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లిందే బీజేపీతో డీల్‌ సెట్‌ చేసుకుని కవితకు బెయిల్‌ ఇప్పించడానికని ఆరోపించారు. లిక్కర్‌ కేసులో కవితకు బెయిల్‌తో బీఆర్‌ఎస్‌, బీజేపీ బంధం బయటపడిందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌కు తన చెల్లి ఏ నేరంపైన జైలుకు వెళ్లిందో చెప్పుకునే ధైర్యం కేటీఆర్‌కు ఉందా అంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండ్రు శోభారాణి అన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 05:57 AM