Share News

Road Accident: పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..

ABN , Publish Date - Aug 15 , 2024 | 07:15 PM

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని నలుగురు మృతిచెందారు.

Road Accident: పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం..

రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని నలుగురు మృతిచెందారు. ముందు వెళ్తున తుపాన్ వాహనాన్ని వెనక నుంచి బొలెరో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా తుపాన్ వాహనంలో ప్రయాణిస్తున్న వారే. వీరిని వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాదాద్రి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా యువకులు కాగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో తుపాన్ డ్రైవర్ తాజ్, వరాలు, దీక్షిత(13) మరో రెండు నెలల చిన్నారి మృతిచెందారు. బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి:

TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..

Minister Tummala: పది వేల కోట్లు ఖర్చయినా మాట నిలబెట్టుకుంటాం..

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

Updated Date - Aug 15 , 2024 | 07:18 PM