Hyderabad: సందడిగా మారిన హైదరాబాద్.. అసలు సంగతి ఏమిటంటే..
ABN , Publish Date - May 29 , 2024 | 09:23 PM
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలే పిల్లలకు వేసవి సెలవులు.. అంతా ఇంటి దగ్గరే.. దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది విహరయాత్రలకు వెళ్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలే పిల్లలకు వేసవి సెలవులు.. అంతా ఇంటి దగ్గరే.. దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది విహరయాత్రలకు వెళ్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువమంది విహరయాత్రకు వచ్చే ప్రాంతం హైదరాబాద్. మహానగరం కావడంతో పాటు ఎన్నో పర్యాటక ప్రదేశాలు చుట్టుపక్కల ఉండటంతో ఎక్కువమంది హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. వేసవిలో విహరయాత్ర కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో టూరిస్ట్‌లు వస్తుండటంతో హైదరాబాద్ నగరం సందడిగా మారింది. ఏ పర్యాటక ప్రాంతంలో చూసిన యాత్రికుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు.. చుట్టుపక్కల ఉన్న యాదగిరి గుట్ట, స్వర్ణగిరి ఆలయాలు యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వేడిగా ఉన్న అకాల వర్షాలతో కొంచెం చల్లగా ఉంటుడటంతో హైదరాబాద్ వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Viral Video: రోడ్డుపై చిన్నపిల్లల్లా ఆడుకుంటున్న మొసలి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఎక్కడ చూసినా జనం..
విహరయాత్రల కోసం అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. పిల్లలకు వేసివి సెలవులు చివరి దశకు చేరుకోవడం, జూన్‌లో పాఠశాలలు, కాలేజీలు రీఓపెన్ కానుండటంతో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు తరలివస్తున్నారు. జూపార్క్, గోల్కోండ కోట, చార్మినార్, సైన్స్ మ్యూజియం, బిర్లా మందిర్, ఎన్డీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, శిల్పారామం, వండర్ లా వంటి ప్రాంతాలకు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. సందర్శకులతో ఈ ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వేడి తక్కువుగా ఉండటంతో పర్యాటకులు భారీగా తరలిరావడానికి కారణంగా తెలుస్తోంది. పర్యాటకుల సంఖ్య పెరగడంతో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది.
నగరంలో సందడి..
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న పర్యాటకులతో హైదరాబాద్ నగరంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు నగరంలోని హోటళ్లు టూరిస్ట్‌లతో నిండిపోయాయి. గత వారం రోజులుగా పర్యాటకులు ఎక్కువుగా తరలివస్తున్నారు. రాత్రి సమయాల్లో నగరంలోని ప్రధాన రెస్టారెంట్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్ట్‌లతో కళకళలాడుతున్నాయి. మరోవారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని టూరిస్ట్ గైడ్‌లు చెబుతున్నారు.
Viral Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. చనిపోయాడనుకున్న దశలో ఎలా బ్రతికించారో చూడండి..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News