Share News

Aarogyasri Scheme: స్పెషాలిటీ ఆస్పత్రుల్లో యథాతథంగా ఆరోగ్యశ్రీ

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:27 AM

రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (తాషా) వెల్లడించింది.

Aarogyasri Scheme: స్పెషాలిటీ ఆస్పత్రుల్లో యథాతథంగా ఆరోగ్యశ్రీ

  • పెండింగ్‌ బకాయిలు విడుదల చేస్తామన్న సర్కారు

  • నెలవారీగా చెల్లింపులు ఉంటాయని హామీ

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (తాషా) వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అందిస్తున్న నగదు రహితసేవలకు చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యం అవుతున్నాయి. జూలై 20 లోగా బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి.


దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ స్పందించి ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులతో చర్చించారు. ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించాల్సిన గత బకాయిలను సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి త్వరలోనే అందజేస్తామన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీ ద్వారా స్పెషాలిటీ ఆస్పత్రులు అందిస్తున్న నగదురహిత సేవలకు క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తాషా 20 నుంచి నగదు రహిత వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

Updated Date - Jul 21 , 2024 | 04:27 AM