Shilparamam: రక్షాబంధన్‌తో సురక్షిత భారత్..
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:01 AM
రక్షాబంధన్‌తో సురక్షిత భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రామంతాపూర్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రక్షాబంధన్‌తో సురక్షిత భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉప్పల్ శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన రాఖీ పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు విలక్షణమైనవని, రక్షా బంధన్ ప్రేమ, అప్యాయత, అనురాగాలు పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ మన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనకు రాఖీలు కట్టగా... వారికి గవర్నర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... రక్షా బంధన్ దేశానికి రక్షణనిచ్చి సురక్షిత భారత్‌గా మారుస్తుందన్నారు. భారతదేశం నాగరికత విశిష్టమైనదని, 140 కోట్ల ప్రజలు ప్రేమ, సహనంతో జీవనం సాగిస్తున్నారన్నారు.