AP News: గుడివాడలో భారీ మోసం.. రుణాల పేరుతో కోట్లు కొట్టేసిన మాయలేడి

ABN, Publish Date - May 25 , 2024 | 09:43 PM

గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పిన ఓ మాయలేడి కోటిన్నర వరకు దోచుకుంది. ఖతర్నాక్ లీలావతి చేతిలో మోసపోయిన బాధితులు తమను ఆదుకోవాలంటూ గుడివాడ రూరల్ పోలీసులను ఆశ్రయించారు.

కృష్ణాజిల్లా: గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పిన ఓ మాయలేడి కోటిన్నర వరకు దోచుకుంది. ఖతర్నాక్ లీలావతి చేతిలో మోసపోయిన బాధితులు తమను ఆదుకోవాలంటూ గుడివాడ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. గుడివాడలోని లక్ష్మినగర్ కాలనీ, టిడ్కో కాలనీ, జగనన్న కాలనీల్లోని మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాల కోసం ప్రైవేట్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇస్తామంటూ నమ్మించిన లీలావతి స్థానిక మహిళలతో 60 గ్రూపులు ఏర్పాటు చేసింది.


గ్రూపుల్లోని సభ్యులకు మంజూరైన రుణాలను అధిక వడ్డీ ఆశచూపి రుణాలు తానే చెల్లిస్తానని సదరు మహిళలకు చెప్పిన మాయలేడి కోటిన్నర వరకు తీసుకుంది. రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో బాధితులు భయపడిపోయారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు భారీ మొత్తంలో వసూలు చేసిందని బాధితులు ఆవేదనవ వ్యక్తం చేస్తున్నారు. పదిమంది చొప్పున గ్రూపులు‌గా చేసి ప్రైవేట్ బ్యాంకుల్లో బాదితుల పేరు మీద నగదు తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆమె దొంగతనంగా సంతకాలు చేయించుకుందని చెబుతున్నారు.


ఆధార్ కార్డు, బ్యంకు లావాదేవీలన్నీ ఆ పేస్తామని బ్యంకు అధికారులు హెచ్చరిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు మీ అకౌంట్లలోనే వేశామని వెంటనే కట్టాలని బ్యాంకు అధికారులు తమపై ఒత్తిడితెస్తున్నారని బాధితులు చెబుతున్నారు. లీలావతి ఇంటికి వెళ్లిన బాధితులు.. ఆమె పరారీ అయినట్లు తెలుసుకొని గుడివాడ తాలుకా పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో లీలావతి ఉంటున్నట్లు తెలుసుకొని బాధితులు ఆమెపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated at - May 25 , 2024 | 10:05 PM